iDreamPost
android-app
ios-app

ఊరంతా ఒకవైపు.. ఈ జంట మాత్రం ఒకవైపు! ప్రేమ కోసం యుద్ధం చేసి!

  • Published Apr 29, 2024 | 4:29 PM Updated Updated Apr 29, 2024 | 4:29 PM

ఇటీవల కాలంలో చాలామంది ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకోలేక, ఇటు పెద్దలను ఎదిరించలేక అర్ధంతరంగా తనువు చలిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రేమ జంట కూడా తమను చంపులేక, దానిని నిలబెట్టుకొనే ధైర్యం లేక ఆత్మహత్యకు పాల్పడింది.

ఇటీవల కాలంలో చాలామంది ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకోలేక, ఇటు పెద్దలను ఎదిరించలేక అర్ధంతరంగా తనువు చలిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రేమ జంట కూడా తమను చంపులేక, దానిని నిలబెట్టుకొనే ధైర్యం లేక ఆత్మహత్యకు పాల్పడింది.

  • Published Apr 29, 2024 | 4:29 PMUpdated Apr 29, 2024 | 4:29 PM
ఊరంతా ఒకవైపు.. ఈ జంట మాత్రం ఒకవైపు!  ప్రేమ కోసం యుద్ధం చేసి!

ఈ మధ్యకాలంలో చాలామంది ప్రేమికులు క్షణికావేశంలో చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఆ నిర్ణయాలు అనేవి వారి జీవితంలోనే కాకుండా.. కుటుంబాల్లో కూడా తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య ప్రమించుకోవడం, ఆ ప్రేమను నిలబెట్టుకోనే ధైర్య లేక వేరే పెళ్లికి సిద్ధమవ్వడం..ఇష్టం లేని పెళ్లి చేసుకొని గుండెల మీద ఆ భారన్ని మోయలేక ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంతేకాకుండా.. ప్రమించిన వారి ఎక్కడ దక్కపోతారని ముందే ఆత్మహత్యలు చేసుకోవడం, కలిసి జీవించలేమని తెలిసి, మరణంలోనైనా ఒకటవ్వాలని ఆత్మహత్యలు చేసుకోనే ఘటనలు రోజు రోజకి ఎక్కవైపోతున్నాయి. ఇలా చాలామంది ప్రేమికులు పెద్దలని ఎదిరించలేక, ప్రేమను చంపులకోలేక, నిండు ప్రాణాలను వదిలస్తూ.. కన్నవారికి కడుపుకోతను మిగులిస్తున్నారు. తాజాగా మరో ప్రేమ జంట తమ పెద్దలను ఎదిరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవల కాలంలో చాలామంది ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకోలేక, ఇటు పెద్దలను ఎదిరించలేక అర్ధంతరంగా తనువు చలిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రేమ జంట కూడా తమను చంపులేక, దానిని నిలబెట్టుకొనే ధైర్యం లేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్)మండల పరిధిలోని తుమ్మలు పెన్ పహాడ్ గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన గుండగాని సంజయ్, అదే గ్రామానికి చెందిన సల్లగుండ్ల నాగజ్యోతి ఆరెళ్లుగా ప్రేమించుకుంటున్నారు.  ఇక సంజయ్ సూర్యాపేటలో ఉంటూ వాటర్‌ ప్లాంట్‌లో మెకానిక్‌గా పనిచేస్తుండగా.. నాగజ్యోతి బీ–ఫార్మసీ పూర్తిచేసింది. కాగా, ఇప్పుడు హైదరాబాద్‌లోని నాగోల్‌ క్రాస్‌ రోడ్‌లో గల ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో పనిచేసుకుంటూ ఎం–ఫార్మసీ చదువుతోంది. ఇకపోతే సంజయ్.. నాగజ్యోతిని ప్రమిస్తున్న అనే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు గతంలో తెలియజేయగా వారు వీరి విహానికి నిరకారించారు.

అయినప్పటికీ మూడేళ్లుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. కాగా, ఇటీవలే గ్రామానికి చెందిన కొందరు నాగజ్యోతి తల్లిదండ్రులకు లేనిపోని విషయాలు చెప్పడంతో.. ఆమె తండ్రి తనని మందలించాడు. అలాగే ఉగాది తర్వాత నుంచి ఆమెను ఉద్యోగం మానిపించి ఇంటి దగ్గరే ఉంచాడు. అయితే తమ ప్రేమ విషయపై గ్రామానికి చెందిన కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తుండడంతో.. ఇక తాము కలిసి ఉండలేమని భావించిన ఆ ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే.. శనివారం రాత్రి సంజయ్, నాగజ్యోతి తమ తమ ఇళ్ల నుంచి బయటికి వచ్చి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగారు. కాగా, ఆదివారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్తేవారు వీరిద్దరిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇక పోస్టుమార్టం అనంతరం.. వారి మృతదేహాలను ఇరువురి కుటుంబ సభ్యులకు అప్పగించగా.. అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే తమ ప్రేమకు అడ్డంకిగా మారి ఇబ్బందులకు గురిచేసిన వారు.. గ్రామానికి చెందిన బెల్లంకొండ నారాయణ, ఆరె లతారెడ్డితో పాటు నాగజ్యోతి బంధువులైన సల్లగుండ్ల అజయ్, సల్లగుండ్ల మల్లయ్య, సల్లగుండ్ల శ్రీను, సల్లగుండ్ల ఉప్పలయ్యతో పాటు నాగజ్యోతి తండ్రి సల్లగుండ్ల శ్రీనుపై చర్యలు తీసుకోవాలని వారు సూసైడ్‌ నోట్‌ రాసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే మృతురాలి తల్లి దుర్గమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసుకుని దర్యాçప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మరి, కలిసి బతకాలేమని తెలిసి ప్రేమ జంట.. చావులోనైనా తోడవ్వలని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండ.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio