iDreamPost
android-app
ios-app

ఓ వైపు అక్క పెళ్లి.. మరోవైపు తమ్ముడు చేసిన పనితో.

  • Published Mar 31, 2024 | 3:47 PM Updated Updated Mar 31, 2024 | 3:48 PM

Adilabad Crime News: ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Adilabad Crime News: ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

  • Published Mar 31, 2024 | 3:47 PMUpdated Mar 31, 2024 | 3:48 PM
ఓ వైపు అక్క పెళ్లి.. మరోవైపు తమ్ముడు చేసిన పనితో.

వివాహ మహోత్సవం ఎంత ఘనంగా జరుపుకుంటారు. ఇరు కుటుంబ పెద్దలు, బంధు మిత్రులతో కోలాహలంగా ఉంటుంది. చాలా వరకు పెళ్లి తంతు తమ ఇంటి ముందే జరిపిస్తుంటారు. మరికొంతమంది తమ సౌలభ్యం కోసం ఫంక్షన్ హాల్స్ లో పెళ్లి వేడుకలు జరిపిస్తారు. ఫంక్షన్ హాల్ లో పెళ్లి కోసం గ్రాండ్ ఏర్పాట్లు చేశారు.. బంధువులు అంతా ఫంక్షన్ హాల్ కి చేరుకున్నారు. అక్కడ వాతావరణం అంతా సందడిగా ఉంది. అంతలోనే ఓ వార్త విని పెళ్లి కూతురు సహా కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ తిన్నారు. ఇంతకీ ఏం జరిగింది.. వారంతా ఎందుకు షాక్ తిన్నారు అన్న విషయం గురించి తెలుసుకుందాం.

ఆదిలాబాద్ లో పెళ్లింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంతో సంతోషంగా పెళ్లి వేడుకలు జరుగుతున్న వేళ పెళ్లి కూతురు సోదరుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పపడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూరు మండలం లక్షటిపేటకు చెందిన అర్క రాంబాయి, మేఘశ్యాంకు ఏడుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారిలో తొమ్మిదవ సంతానం అర్క వినోద్ (25). ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.తన సోదరి వివాహం జరగబోతున్న సమయానికే ఇంట్లో ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. శుక్రవారం తన అక్క అర్క అనసూయ పెళ్లి సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు నార్నూర్ కి వెళ్లారు. వినోద్ మాత్రం ఇంటి వద్ద ఉండిపోయాడు.

సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పపడ్డాడు.పొరుగువారు వినోద్ ని పిలిస్తే ఎంతకు సమాధానం రాకపోవడంతో కిటికీ నుంచి చూడగా దూలానికి తాడుతో ఉరివేసుకొని చనిపోయి కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకునన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.  కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గత కొంత కాలంగా వినోద్ ఒంటరిగా ఉంటూ.. ఎదో ఆలోచిస్తూ విషాదంగా కనిపిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom