iDreamPost
android-app
ios-app

వివాహితపై భర్త బంధువుల దారుణం! అసలేం జరిగిందంటే?

  • Published Jul 31, 2024 | 8:30 AM Updated Updated Jul 31, 2024 | 8:30 AM

Achampet Crime News: వివాహబంధంలోకి అడుగు పెట్టిన నూతన దంపతులను నిండు నూరేళ్లు పిల్లా పాపలతో జీవించాలని పెద్దలు దీవిస్తుంటారు. పైళ్లై సంతానం కలగకుంటే ఆడవాళ్లపై లేనిపోని అభాండాలు వేస్తూ మానసికంగా కృంగిపోయేలా చేస్తుంటారు అత్తింటివారు.. బంధువులు.

Achampet Crime News: వివాహబంధంలోకి అడుగు పెట్టిన నూతన దంపతులను నిండు నూరేళ్లు పిల్లా పాపలతో జీవించాలని పెద్దలు దీవిస్తుంటారు. పైళ్లై సంతానం కలగకుంటే ఆడవాళ్లపై లేనిపోని అభాండాలు వేస్తూ మానసికంగా కృంగిపోయేలా చేస్తుంటారు అత్తింటివారు.. బంధువులు.

  • Published Jul 31, 2024 | 8:30 AMUpdated Jul 31, 2024 | 8:30 AM
వివాహితపై భర్త బంధువుల దారుణం! అసలేం జరిగిందంటే?

వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను పెద్దలు నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని దీవిస్తుంటారు. పెళ్లై రెండు మూడు సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టకుంటే వైద్యులను సంప్రదించడం మొదలు పెడుతుంటారు. కనిపించిన చెట్టూ, పుట్టా మొక్కుతుంటారు. దేవుళ్ళ చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటారు. పిల్లలు పుట్టకపోవడానికి కారణం గురించి తెలుసుకోకుండా ఆడవాళ్లపై నిందలు మోపి నానా హింసలు పెడుతుంటారు. దేశంలో ఇలా ఎంతోమంది మహిళలు నరకం అనుభవిస్తూనే ఉన్నారు. అలాంటి ఘటన అచ్చంపేటలో చోటు చేసుకుంది. వివాహితపై బంధువులు రాబంధువుల్లా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే..

పెళ్లై ఇంత కాలం అయినా నీకు పిల్లలు పుట్టడం లేదు.. ఇక పుట్టరు అంటూ ఓ వివాహితను భర్తతో పాటు ఆమె బంధువులు రాళ్లతో కొట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అచ్చంపేట పదరా మండలానికి చెందిన ఎడ్మ శ్రీదేవి (40) భర్త కృష్ణయ్య, అతని బంధువులు జక్కుల తిరుపతయ్య, జక్కుల రాజు, బాలయ్య మరికొంత మంది కలిసి పెళ్లై ఇన్ని ఏళ్లు గడిచినా నీకు సంతాన ప్రాప్తి లేదు.. నీకు పిల్లలు పుట్టరు, నువు గొడ్రాలివి అంటూ నిందలు వేయడమే కాదు.. నీకు ఇంట్లో స్థానం లేదు నీ ఇల్లు అమ్మనివ్వం అంటూ మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేశారు.

ప్రతిరోజూ శ్రీదేవిని సూటి పోటి మాటలతో మానసికంగా చిత్రవద చేస్తూ వస్తున్నారు. దారుణం ఏంటంటే బంధువులకు ఆమె భర్త కృష్ణయ్య కూడా తోడయ్యాడు. ఈ మధ్యనే చిన్న గొడవ జరిగింది.. ఈ సందర్భంగా ఆమె బంధువులతో పాటు కృష్ణయ్య కూడా నీవు గొడ్రాలివి నీకు పిల్లలు పుట్టరు నువు ఇంట్లో ఉండటానికి వీల్లేదు అంటూ రాళ్లతో కొట్టి గాయపరిచారు. ఆ అవమానం తట్టుకోలేకపోయింది శ్రీదేవి. బంధువులే కాదు ఇన్నాళ్లు కాపురం చేసిన తన భర్త కూడా అర్థం చేసుకోవడం లేదని తవ్ర మనస్థాపానికి గురైంది. ఈక్రమంలోనే ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై మృతురాలి అన్న దాసరి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom