Krishna Kowshik
చేపలు పట్టడం సరదాగా అనిపిస్తుంది. సరదాగా అప్పుడప్పుడు చేపల వేట చేస్తుంటారు కొందరు. కానీ ఓ గ్రామం మొత్తం వజ్రాల వేటకు వెళ్లినట్లు.. చేపల వేటకు వెళ్లింది. ఈ విషయం పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది.
చేపలు పట్టడం సరదాగా అనిపిస్తుంది. సరదాగా అప్పుడప్పుడు చేపల వేట చేస్తుంటారు కొందరు. కానీ ఓ గ్రామం మొత్తం వజ్రాల వేటకు వెళ్లినట్లు.. చేపల వేటకు వెళ్లింది. ఈ విషయం పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది.
Krishna Kowshik
మాంసం తర్వాత అంతే డిమాండ్ చేపలకు ఉంటుంది. చేపలతో ఏ కర్రీ వండినా లొట్టలేసుకుని తింటుంటారు. చేపల పులుసు, చేపల కూర, ఫ్రై ఇలా రకరకాలుగా ట్రై చేస్తుంటారు. సండే వస్తే చాలు చేపలు తెచ్చేందుకు మార్కెట్‌కు వెళుతుంటారు నగర వాసులు. నగరాల్లో వీటికి బాగా డిమాండ్ ఉంటుంది. ఇక పల్లెటూళ్లలో అయితే విరివిగా దొరుకుతుంటాయి. అంతే కాకుండా ఇప్పుడు ఇదొక వ్యాపారంగా మారిపోయింది. పొలాలను చెరువులుగా మార్చి చేపలను పెంచుతూ వ్యాపారం చేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో సాధారణంగా ఏర్పడ్డ చెరువుల్లో చేపలు పట్టుకుని జీవనం సాగిస్తుంటారు మత్స్యకారులు. అయితే ఇప్పుడు పడ్డ వర్షాలకు చెరువులన్నీ కళకళలాడుతున్నాయి. దీంతో చేపల వేట కూడా కొనసాగుతుంది.
తాజాగా ఓ గ్రామంలో చేపల చెరువుపై దండ యాత్ర చేశారు స్థానికులు. వలలు, ఇతర వస్తువలతో చేపలను పట్టేందుకు చెరువులోకి దిగారు. దీంతో అక్కడ ఒక్కసారిగా కోలాహలం మొదలైంది. కాగా, మత్స్యకారులు మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు. తాము పట్టుకుంటున్నచెరువులోకి ఊరంతా కదిలి రావడంతో ఊసురుమంటూ తలలు పట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. దొరికినోళ్లు.. దొరికినన్నీ చేపలు పట్టుకుని పోయారు. దీంతో పుష్కరాలను తలపించింది చెరువు. ఏదో తీర్థయాత్రలకు వెళ్లినట్లు ఒక్కసారిగా చెరువుపై ఎగబడ్డారు జనం. దీంతో చెరవంతా ఖాళీ అయిపోయింది. చివరకు పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారంటే… తీవ్ర ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు. చేపల కోసం చెడ్డీలతో దిగిపోయారు కుర్రకారు. తమకు నచ్చిన పద్దతుల్లో వల వేసి పట్టారు.
ఇంత వింత పరిస్థితి ఎక్కడ నెలకొందంటే. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని నెరడ గ్రామంలో. ఆ గ్రామంలో పెద్ద చెరువు ఉంది. ఇటీవల పడుతున్న వర్షాలకు చెరువు నిండి..చేపలకు ప్రాణం పోసినట్లయ్యింది. కానీ వాటిని పట్టుకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల నోటికాడ ముద్దను దూరం చేశారు గ్రామస్థులు. రోజులానే.. ఆ చెరువు దగ్గర మత్స్యకారులు చేపలు పడుతుండగా.. ఒక్కసారిగా తండోపతండాలుగా ఎగబడ్డారు. మొత్తం చేపల్ని లూటీ చేశారు. అయితే పోలీసులకు సమాచారం వెళ్లింది. గ్రామస్థులను ఆపేందుకు ఎంత ప్రయత్నించగా ఆగలేదు. వారిని సైతం లెక్క చేయకుండా చేపల వేటలో పడ్డారు. కాగా, చెరువు లూటీ చేయడం ఇది తొలిసారి కాదని స్థానిక మత్య్సకారులు చెబుతున్నారు. కాగా, మృగశిర కార్తె సమీపిస్తున్న సమయంలో గ్రామస్థులకు ఈ చెరువుపై హక్కులు ఉంటాయని, అందుకే తాము చేపలు పట్టుకుంటున్నామని చెబుతున్నారు స్థానికులు. దీంతో మత్స్యకారులు నష్టపోయినట్లు అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.