Krishna Kowshik
ఇంటా, బయటే కాదు.. దేవాలయాలకు ప్రతిరూపంగా భావించే స్కూల్లో కూడా ఆడ పిల్లలకు రక్షణ కొరవడింది. టీచర్ల రూపంలో కూడా కామాంధులు తయారయ్యారు. చివరకు.. చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదు.
ఇంటా, బయటే కాదు.. దేవాలయాలకు ప్రతిరూపంగా భావించే స్కూల్లో కూడా ఆడ పిల్లలకు రక్షణ కొరవడింది. టీచర్ల రూపంలో కూడా కామాంధులు తయారయ్యారు. చివరకు.. చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదు.
Krishna Kowshik
ఎటు పోతుంది సమాజం.. ఎక్కడకు వెళుతున్నాం మనం అనే ప్రశ్నించుకునే స్థాయికి రావాల్సిన దారుణ పరిస్థితులు నేడు ఏర్పడుతున్నాయి. మహిళలు, యువతులు, ఆడ పిల్లలు, చివరకు పసికందులను కూడా వేధిస్తున్నారు కామాంధులు. తండ్రి, కూతురు రిలేషన్ గురించి తప్పుగా మాట్లాడో సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్. మన ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి, భార్య ఉన్నారన్న ఇంగిత జ్ఞానం మరిచి.. నోటికి హద్దు అదుపు లేకుండా చర్చా వేదిక పెట్టాడు. చివరకు జైలు పాలయ్యాడు. అలాగే ఎనిమిదేళ్ల చిన్నారిపై ముగ్గురు మైనర్లు ‘హత్యాచారానికి ఒడిగట్టారు. చివరకు ఆ బిడ్డ నేటికి దొరకలేదు. అంతేనా ఆరు నెలల పసికందుపై తాత వరుసయ్యే వ్యక్తి అకృత్యానికి పాల్పడ్డాడు. ఇది అత్యంత గుజుప్సాకరం.
ఇప్పుడు ఓ ఉపాధ్యాయుడు కామంతో కళ్లు మూసుకుపోయి.. చిన్నారి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చివరకు ఆ పాప తల్లిదండ్రులకు చెప్పడంతో టీచర్‌ను చితకబాదారు. ఈ ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కిరణ్ ఇంటర్నేషన్ స్కూల్లో ఓ వ్యక్తి డ్యాన్స్ మాస్టర్‌గా పిల్లలకు డ్యాన్సులు నేర్పిస్తున్నాడు. ఈ క్రమంలో ఒకటో తరగతి విద్యార్థిపై అనుచితంగా ప్రవర్తించాడు. స్కూల్లో ఆమెను అనుచితంగా తాకాడు. ఇంటికి వెళ్లిన చిన్నారి.. స్కూల్లో డ్యాన్స్ టీచర్ తనను తాకరాని చోట తాకడంటూ చెప్పడంతో ఆవేశంతో పాఠశాలకు వెళ్లి నిలదీశారు. అనంతరం డ్యాన్స్ టీచర్‌ను మేనేజ్ మెంట్ పిలిపించగా.. అతడిపై విరుచుకుపడ్డారు.
అతడ్ని కింద పడేసి తన్నారు పస్ట్ క్లాస్ స్టూడెంట్ పేరెంట్స్. ఆవేశంతో దూషణలు చేసి.. ఇలాంటి వాడిని బ్రతకనివ్వకూడదు అంటూ కొట్టారు. ఆ పిల్ల ఎంత వయస్సు ఉందని అలా టచ్ చేశావంటూ మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. తనను టచ్ చేయలేదంటూ పేర్కొన్నాడు టీచర్. అసభ్యకరంగా తాకితేనే పాప చెప్పిందంటూ వెల్లడించారు ఆమె తరుఫు వారు. ఇదిలా ఉంటే స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. తమకు ఫిర్యాదు చేయాలని, ఇలా దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. పిల్లల్ని బడికి పంపాలంటేనే భయమేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
ఒకటో తరగతి చిన్నారిపై డ్యాన్స్ మాస్టార్ లై*గిక వేధింపులు
డ్యాన్స్ టీచర్‌ను చితక్కొట్టిన పేరెంట్స్
మేడ్చల్ జిల్లా, బోడుప్పల్.. కిరణ్ ఇంటర్నేషల్ స్కూల్లో ఘటన#childrens #childrenssaftey #LatestNews #boduppal #bigtv@Collector_MDL pic.twitter.com/Ym8vKmFBPU— BIG TV Breaking News (@bigtvtelugu) July 15, 2024