Keerthi
హైదరాబాద్ నగరంలో నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా తిరిగే మెట్రో రైళ్లకు తాజాగా హైకోర్ట్ నుంచి నోటీసులు వచ్చాయి. అయితే హైకోర్టు నుంచి మెట్రో రైళ్లకు నోటీసులు రావడానికి కారణం ఇదే..
హైదరాబాద్ నగరంలో నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా తిరిగే మెట్రో రైళ్లకు తాజాగా హైకోర్ట్ నుంచి నోటీసులు వచ్చాయి. అయితే హైకోర్టు నుంచి మెట్రో రైళ్లకు నోటీసులు రావడానికి కారణం ఇదే..
Keerthi
హైదరాబాద్ నగరవాసులకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణం చాలా సులభంతరమైంది. పైగా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా.. చాలా వేగంగా, సురక్షితంగా తమ గమ్యస్థానలకు చేరుకుంటున్నారు. ఇక ఒకప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా గంటలు సమయం పట్టేది. కానీ, ఇప్పుడు నిమిషాల వ్యవధిలో ఎంత దూరమైన ప్రయాణించడానికి సులువగా ఈ మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా.. ఎండ, వాన వంటి భయాలేవీ లేకుండా.. చక్కగా ఏసీలో ప్రయాణించవచ్చు. అందుచేత నగరంలో ఎన్నిసదుపాయాలు ఉన్నా.. మెట్రోకు సాటి ఏదీ లేదంటూ ప్రతిఒక్కరు ఈ మెట్రో ప్రయాణానికి ఆసక్తి చూపుతారు. అయితే అలాంటి మెట్రో ట్రైన్ కు తాజాగా హై కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. కారణం ఏమిటంటే..
నగరంలో నిత్యం వేలాది మంది ప్రయాణికులతో ఉదయం 6 గంటల నుంచి మళ్లీ రాత్రి 11 59 గంటల వరకు రద్దీగా తిరిగే ఈ మెట్రో రైళ్లకు తాజాగా హైకోర్ట్ నుంచి నోటీసులు వచ్చాయి. అయితే హైదనరాబాద్ మెట్రో శబ్ద కాలుష్యమే అందుకు కారణం అంటూ హైకోర్టు.. మెట్రో రైలు ఎండీకి నోటీసులు జారీ చేసింది. ఇక ఆ వివరాళ్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ సమీపంలోని గల బోయిగూడ మెట్రో పిల్లర్ B1006 వద్ద రైల్వే ట్రాక్ పంపు దగ్గర మితిమీరిన శబ్దం వస్తోందని.. కాగా, వెంటనే ఈ శబ్ద నియంత్రణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని డాక్టర్ హనుమాన్లు అనే వ్యక్తి హైకోర్టుకు లేఖ రాశారు. ఇక అందులో పరిమితికి మించి రైలు శబ్దం వస్తున్న కారణంగా అసౌకర్యంగా ఉందని.. దీని వలన వినికిడి సమలతో పాటు బీపీ, గుండెపోటు వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందని ఆ లేఖలో వెల్లడించారు.
ఇక పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, పొల్యూషన్ కంట్రోల్ నిబంధనల ప్రకారం.. అధిక శబ్దం హార్మోన్ల సమతౌల్యతను దెబ్బతీస్తుందని డాక్టర్ హనుమాన్లు ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, ఇటీవలే మెట్రో రైల్వే బృందం బోయిగూడ, జూబ్లీహిల్స్ బస్‌స్టేషన్, ఎంజీ బస్‌స్టేషన్‌ల వద్ద మెట్రో రైలు వెళుతున్నపుడు ఈ శబ్దాన్ని రికార్డు చేసిందన్నారు. అయితే ఎంఎన్‌కె విఠల్ అపార్ట్‌మెంట్ వద్ద ట్రైన్ వెళుతున్నపుడు ధ్వని తీవ్రత 80 డెసిబుల్స్ ఉందని చెప్పారు. కాగా, మెట్రో నగరాలైన బెంగళూరు, నోయిడా, ముంబయి, చెన్నై, నాగ్‌పుర్, కోల్‌కతాల్లో సౌండ్ పొల్యూషన్ నిరోధించేలా సోలార్ ఎలక్ట్రిక్ ప్లేట్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కనుక ఇక్కడ కూడా అలాంటి సిస్టమ్ ఏర్పాటు చేసి ఈ ధ్వని కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు విద్యుదుత్పత్తి చేపట్టాలన్నారు.
కాగా, హనుమాన్లు రాసిన ఈ లేఖను ప్రజాప్రయోజనకరంగా ఉండడంతో హైకోర్టు దానిని పరిగణనలోకి తీసుకుంది. ఇక దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అలాగే ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, తెలంగాణ డీజీపీ, నగర పోలీసు కమిషనరు, మెట్రో రైలు ఎండీ, మెట్రోరైల్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్లకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. మరి, మితిమిరీన శబ్దం కారణంగా హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు నోటీసులు జారీ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.