iDreamPost
android-app
ios-app

విద్యార్థుల తల్లిదండ్రులకు అలర్ట్.. పాఠశాల టైమింగ్స్ లో కీలక మార్పులు

  • Published May 26, 2024 | 11:48 AMUpdated May 26, 2024 | 12:35 PM

తాజాగా రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల పనివేళలను మార్చుతున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఇకపై అన్ని పాఠశాలలో ఆ సమయాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

తాజాగా రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల పనివేళలను మార్చుతున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఇకపై అన్ని పాఠశాలలో ఆ సమయాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

  • Published May 26, 2024 | 11:48 AMUpdated May 26, 2024 | 12:35 PM
విద్యార్థుల తల్లిదండ్రులకు అలర్ట్.. పాఠశాల టైమింగ్స్ లో కీలక మార్పులు

ప్రస్తుతం వేసవికాలం కావడంతో విద్యార్థులు అందరూ సమ్మార్‌ హాలిడేస్‌ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ వేసవి సెలవులు అనంతరం మళ్లీ జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.ఇక విద్యార్థులంతా ఈ వేసవి సెలవులను ముగించుకొని తిరిగి విద్యా స​ంస్థలకు హాజరుకావల్సి ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల పనివేళలు మార్చుతూన్నట్లు విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల పనివేళలను మార్చుతున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. కాగా, ఈ పాఠశాల వేలలు అనేవి ఉదయం 9 గంటలకే బడులు ప్రారంభమవుతాయని పేర్కొన్నది. అయితే 2024 -25 విద్యాసంవత్సరం నుంచే ఈ పాఠశాల పనివేళలు అమల్లో ఉంటాయని ఎస్సీఈఆర్టీ అధికారులు ప్రకటించారు. ఇకపోతే గతంలో 9 గంటలకే బడులు ప్రారంభమయ్యేవి. కానీ, అప్పట్లో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రాథమిక పాఠశాలల బడివేళలను ఉదయం 9:30 గంటలకు మార్చారు.

School Timings

అయితే ఈ పాఠశాల వేలలు వలన ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు విద్యార్థులుంటే.. ఒకరిని ఉదయం 9గంటలకు, మరొకరిని ఉదయం 9:30 గంటలకు బడికి తీసుకెళ్లాల్సి రావడంతో.. తల్లిదండ్రులు ఇబ్బందిపడుతున్నారని,  కావున అప్పటలో ఈ బడి సమయాలు మార్చాలని అప్పట్లో కోరగా బడి పనివేళలను మార్చారు. కాగా, మళ్లీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించి ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలను తిరిగి ఉదయం 9గంటలకే ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇక ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలను తిరిగి ఉదయం 9గంటలకే ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నారు.  ఈ క్రమంలోనే.. ఉన్నత పాఠశాలలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యి తిరిగి సాయంత్రం  4:45 గంటల వరకు నిర్వహిస్తారు. ముఖ‍్యంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో మాత్రం ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే నడుపుతారు.

ఇక 1- 7వ తరగతుల వరకు నిర్వహించే ప్రాథమికోన్నత పాఠశాలలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు నిర్వహిస్తారు. 1-5 తరగతులకు మాత్రం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో..  ఈ స్కూళ్లు ఉదయం 8:45 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 3:45 గంటల వరకు నడుస్తాయి. ఇదిలా ఉంటే..  ఒకే ప్రాంగణంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలుంటే ఆయా స్కూళ్లు ఉన్నత పాఠశాల వేళలనే పాటించాలి. కాకపోతే ఈ స్కూళ్లు అన్ని ఉదయం 9:30గంటలకు ప్రారంభమయిన  ముగింపు మాత్రం భిన్నంగా ఉంటుంది. ఇక మధ్యాహ్నభోజనం కోసం 45 నిమిషాల విరామం కూడా ఇస్తారు.

School Timings

దీంతో పాటు పాఠశాల బడిబాట షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ ఖరారు చేసింది. ఎప్పటిలానే  అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు.. ఈ సారి కూడా జూన్‌ 1 నుంచి 11 వరకు బడిబాట నిర్వహించనున్నారు. కాగా, 2024 -25 విద్యాసంవత్సరం జూన్‌ 12న ప్రారంభమయ్యి తిరిగి   2025 ఏప్రిల్‌ 23న ముగియనున్నది. ఇలా దాదాపు 229రోజుల పాటు బడులను నిర్వహిస్తారు. ఇక 2024 -25 విద్యాసంవత్సరం అకడమిక్‌ క్యాలెండర్‌ను ఎస్సీఈఆర్టీ శనివారం విడుదల చేసింది. ఇందులో  2025 ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. అలాగే పదో తరగతి సిలబస్‌ను 2025 జనవరి 10లోపు, 1 నుంచి 9 తరగతుల సిలబస్‌ను 2025 ఫిబ్రవరి 28లోపు పూర్తిచేస్తారు. ఇకపోతే బడుల్లో యోగా, ధ్యానాన్ని తప్పనిసరిగా నిర్వహించేలా చేస్తున్నారు. మరి పాఠశాలలో విద్యా సంస్థల సమయాల్లో మార్పులపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి