iDreamPost
android-app
ios-app

మూడు రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే వరుడు మృతి.. ఏం జరిగింది

పెళ్లంటే బోలెడు ఆశలు ఉంటాయి కాబోయే వరుడు, వధువుకైనా. తన జీవితంలోకి రాబోతున్న అమ్మాయి గురించి కలలు కంటూ ఉంటాడు అబ్బాయి. భవిష్యత్తుపై ఎన్నో ప్రణాళికలు ఉంటాయి. కానీ వాటన్నింటినీ..

పెళ్లంటే బోలెడు ఆశలు ఉంటాయి కాబోయే వరుడు, వధువుకైనా. తన జీవితంలోకి రాబోతున్న అమ్మాయి గురించి కలలు కంటూ ఉంటాడు అబ్బాయి. భవిష్యత్తుపై ఎన్నో ప్రణాళికలు ఉంటాయి. కానీ వాటన్నింటినీ..

మూడు రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే వరుడు మృతి.. ఏం జరిగింది

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే జరిగే అద్భుతమైన వేడుక. అమ్మాయికైనా, అబ్బాయికైనా పెళ్లి అనగానే.. తన జీవితంలోకి వచ్చే భాగస్వామి గురించి ఆలోచించడమే కాకుండా భవిష్యత్తుపై ఎన్నో ఆశలు, ఆశయాలను పెట్టుకుంటారు. ఇక పెళ్లి ముచ్చట్లు తీరి..తేదీ ఖరారు చేసుకున్నాక.. పసుపు కొట్టడం.. కార్డులు ప్రింట్ చేయించి ఆహ్వానాలు పంపడం వంటి పనులు చక చకా జరిగిపోతుంటాయి. వివాహం దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్, ఏదో తెలియని సంఘర్షణ ఉన్నప్పటికీ.. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ఆనందం ఉంటుంది. అలానే సంబరంలో మునిగి తేలిపోయాడు ఈ యువకుడు కూడా.

పెళ్లికి ఇంకా మూడు రోజులే గడువు ఉంది. ఆ ఇంటి నిండా బంధువులు, చుట్టాలు, ఇరుగు పొరుగు రాకపోకలతో సందడిగా సాగిపోతుంది. అంతలో ఒక్కసారిగా ఆ ఇంటిని విషాద ఛాయలు అలముకున్నాయి. మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కి.. కొత్త జీవితాన్ని ఆరంభించాల్సిన కుర్రాడు.. అనంత లోకాలకు తరలి వెళ్లిపోయాడు. జీవితంపై ఎన్నో కలలు కన్న యువకుడ్ని.. మృత్యువు కబళించింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. కడెం మండలం చిన్న బెల్లాల్‌కు చెందిన మీరాల నీలయ్య, కళావతి దంపతులు జీవిస్తున్నారు. వీరికి వినోద్ అనే కుమారుడు ఉన్నాడు. జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లి.. అక్కడ సంపాదించిన డబ్బులు ఇంటికి పంపేవాడు.

కొడుకు పంపిన డబ్బులతో స్వగ్రామంలో ఇల్లు నిర్మించారు పేరెంట్స్. ఐదు నెలల క్రితమే ఇంటి నిర్మాణ పనులు దగ్గరుండి చేయించుకున్నాడు వినోద్. ఆ సమయంలో జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 18న వివాహం జరగాల్సి ఉంది. వినోద్ పెళ్లి పనుల్లో బిజీగా మారిపోయాడు. అంతలో స్నానం చేద్దామని.. గీజర్ అన్ చేసి నీటిని పట్టుకునేందుకు టాప్ తిప్పాడు. స్టీల్ టాప్ కావడంతో గీజర్ ద్వారా వచ్చిన నీటితో కరెంట్ షాక్ తగిలి కేకలు వేశాడు. గది తలుపులు మూసి ఉండటంతో కుటుంబ సభ్యులు తలుపు బద్దలు కొట్టి బయటకు తీసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. చివరకు పెళ్లి ఇల్లు కాస్తా.. విషాదంతో నిండిపోయింది. కొడుకును పెళ్లి కుమారుడిగా చూడాలనుకున్న తల్లిదండ్రులు.. ఇలా విగత జీవిగా చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. కేసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి