TGSTRC సంచలన నిర్ణయం.. ఆ రూట్‌లో బస్సులు రద్దు! ఎందుకో తెలుసా?

TGSTRC Key Decision: ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు అధ్వాన్నంగా మారిపోయాయి. ఈ క్రమంలోనే టీజీఎస్ఆర్టీసీ ఆ రూట్స్ లో నడిచే బస్సులపై కీలక నిర్ణయం తీసుకుంది.

TGSTRC Key Decision: ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు అధ్వాన్నంగా మారిపోయాయి. ఈ క్రమంలోనే టీజీఎస్ఆర్టీసీ ఆ రూట్స్ లో నడిచే బస్సులపై కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలపై ప్రత్యేక ఫోకస్ పెడున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500 లకు గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. దీంతో మునుపెన్నడూ లేని విధంగా ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల తాకిడి మొదలైంది. తాజాగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన తర్వాత ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కువగా మహిళలు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే మగవాళ్లు బస్సులు ఎక్కలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఈ సమస్యలు తీర్చేందుకు కొత్త బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు వినతి పత్రాలను అందించారు. దీనిపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. త్వరలోనే కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.

ఇదిలా ఉంటే.. ఆర్టీసీ అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నర్సాపూర్- పటాన్ చెరు మార్గంలో బస్సులను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ నర్సాపూర్ వయా కొండాపూర్, కాగజ్ మద్దూర్, నత్నాయిపల్లి, సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం శేర్కాన్ పల్లి, జిన్నారం మండలం సోలక్ పల్లి, శివానగర్ మీదుగా పటాన్ చెరు వరకు నర్సాపూర్ బస్టాండ్ నుంచి నిత్యం మూడు బస్సులు పదిహేను ట్రిప్పులు నడుస్తూ వచ్చాయి. ఇటీవల వర్షాల కారణంగా రోడ్లన్నీ పూర్తిగా పాడైపోయాయి. దీంతో ఈ మార్గాల్లో బస్సులు నడపలేమని.. ఈ కారణంగానే బస్సులను రద్దు చేస్తూ పంచాయతీ కార్యదర్శలకు లేఖలు పాంపారు అధికారుల.

ఈ మార్గంలో బస్సులు నడిపితే స్ప్రింగ్, కమాన్ పట్టీలు విరిగి టైర్లు పగిలిపోతున్నాయని ఆ లేఖలో అధికారుల పేర్కొన్నారు. ఈ మార్గాల్లో ఆదాయం కన్నా.. నష్టమే ఎక్కువగా ఉండటం వల్ల బస్సులు రద్దు చేయాల్సి వస్తుందని లేఖలో పేర్కొన్నారు. రద్దు చేసిన బస్సులను ఇతర మార్గాలకు బదలాయించారు. ప్రస్తుతం నర్సాపూర్ టు దౌల్తాబాబ్, మల్కాపూర్ మీదుగా పటాన్ చెరు వరకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు రోడ్లు బాగు చేసి మళ్లీ బస్సులను పునరుద్దీకరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Show comments