ప్రయాణికులకు TGSRTC భారీ శుభవార్త.. మరో కీలక ప్రకటన!

తెలంగాణ ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ భారీ శుభవార్త చెప్పింది. వారి కోసం కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

తెలంగాణ ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ భారీ శుభవార్త చెప్పింది. వారి కోసం కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ ముందుకు సాగుతుంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలనే కాక.. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని.. అనేక ఇతర కార్యక్రమాలను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ప్రతి ఒక్కరికి డిజిటల్‌ హెల్త్‌ కార్డ్‌ ఇవ్వడానికి రెడీ అయ్యింది రేవంత్‌ సర్కార్‌. అలానే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వల్ల రద్దీ పెరగడంతో.. బస్సుల సంఖ్యను పెంచడమే కాక.. అదనపు సిబ్బంది భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. వారి కోసం కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

ఈ ఆదివారం నుంచి అనగా.. జూలై 7 నుంచి తెలంగాణ పండుగగా ప్రసిద్ధి చెందిన ఆషాఢ బోనాలు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. బోనాలు ఉత్సవాల కోసం ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఆదివారం జరగబోయే చరిత్రాత్మకమైన గోల్కొండ జగదాంబిక బోనాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్‌టీసీ 75 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది.

హైదరాబాద్‌లోని 24 ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. గోల్కొండ బోనాలకు వెళ్లాలనుకునే భక్తుల కోసం.. సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వే స్టేషన్‌, సీబీఎస్‌, పటాన్‌ చెరు, ఈసీఐఎల్‌, మెహిదీపట్నం, దిల్‌ షుక్‌నగర్‌, కూకట్‌పల్లి, చార్మినార్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి, పాత బోయిన్‌పల్లి, మల్కాజిగిరి, తదితర ప్రాంతాల నుంచి గోల్కొండ కోట వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.

బోనాలకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ సంస్థ కోరుతోంది. అంతేకాక కేవలం జూలై 7వ తేదీన మాత్రమే ఈ ప్రత్యేక బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి అని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గోల్కొండకు 10 బస్సులు ప్రత్యేకంగా నడుపనున్నారు. ఇక కాచీగూడ రైల్వే స్టేషన్ నుంచి 5 బస్సులు అదనంగా ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. అలాగే సీబీఎస్ నుంచి చూస్తే 5 ప్రత్యేక బస్‌లు ఉన్నాయి. పటాన్ చెరువు నుంచి మరో 5 స్పెషల్ బస్సులు గోల్కొండకు నడవనున్నాయి.

ఇలా నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి గోల్కొండ బోనాల కోసం మొత్తంగా 75 బస్సులను స్పెషల్‌గా నడపనున్నట్లు టీజీఎస్ఆర్‌టీసీ వెల్లడించింది. అంతేకాకుండా ప్రయాణికుల కోసం హెల్ప్ డెస్క్‌లు కూడా ఏర్పాటు చేశారు. 9000406069, 9959226133, 9959226131 నెంబర్లకు కాల్ చేసి బస్సు రూట్లకు సంబంధించి వివరాలు పొందవచ్చు.

Show comments