iDreamPost

VC Sajjanar: బస్సు కింద పడుకుని యువకుడి పిచ్చి పని.. సజ్జనార్‌ సీరియస్‌ వార్నింగ్‌

  • Published Jun 22, 2024 | 9:09 AMUpdated Jun 22, 2024 | 9:09 AM

రీల్స్‌ పిచ్చితో కొందరు చేస్తోన్న పనులు.. ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో వసోషల్‌ మీడియాని షేక్‌ చేస్తోంది. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వివరాలు..

రీల్స్‌ పిచ్చితో కొందరు చేస్తోన్న పనులు.. ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో వసోషల్‌ మీడియాని షేక్‌ చేస్తోంది. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వివరాలు..

  • Published Jun 22, 2024 | 9:09 AMUpdated Jun 22, 2024 | 9:09 AM
VC Sajjanar: బస్సు కింద పడుకుని యువకుడి పిచ్చి పని.. సజ్జనార్‌ సీరియస్‌ వార్నింగ్‌

పిచ్చి వేషాలు, పనులకు పాల్పడే వారిని ఉద్దేశించి మన తెలుగులో ఎన్నో సామెతలు ఉన్నాయి. పోయే కాలం వస్తే ఇలానే ప్రవర్తిస్తారు.. అని చెబుతారు. ఇక తాజాగా కొందరు యువత చేసే పనులు చూస్తే.. వారిని ఏం అనాలో కూడా అర్థం కాదు. ఏ భాషలో తిట్టాలో కూడా తెలియదు. వారు చేసే పనుల వల్ల వారికి మాత్రమే కాక.. తమ చుట్టు పక్కల ఉన్న వారికి కూడా ప్రమాదం కలిగిస్తారు. ఇక నేటి కాలంలో యువతలో సోషల్‌ మీడియా క్రేజ్‌, రీల్స్‌ పిచ్చితో కొందరు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఓ యువతి బిల్డింగ్‌ మీద నుంచి వేలాడుతూ వీడియో తీసిన సంగతి తెలిసిందే. మరో యువతి ప్రమాదకరంగా కారు డ్రైవ్‌ చేస్తూ.. 300 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఇక తాజాగా ఇలాంటి ఓ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ వివరాలు..

తాజాగా సోషల్‌ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్‌ అవుతుంది. ఇక దీనిలో ఏం ఉంది అంటే.. హైదరాబాద్‌లోని రోడ్డుపై వేగంగా వస్తున్న ఆర్టీసీ లోకల్ బస్సు ముందుకు ఓ యువకుడు అకస్మాత్తుగా వచ్చి.. ఆ బస్సు కింద పడుకుంటాడు. బస్సు వెళ్లిపోయాక ఎంచక్కా లేచి.. షర్ట్‌కి అంటిన దుమ్ము దులుపుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతడికి చిన్న గాయం కూడా కాలేదు. ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాక విపరీతంగా వైరల్‌ అవుతోంది. దాంతో ఈ వీడియో కాస్త ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి చేరింది. దీనిపై స్పందిస్తూ.. సజ్జనార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోన్న ఈ వీడియో.. ఫేక్‌ అని సజ్జనార్ స్పష్టం చేశారు. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో అని.. సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు కొందరు ఆకతాయిలు ఇలా వీడియోలను ఎడిట్‌ చేసి పోస్ట్‌ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఇలాంటి పిచ్చి పనులతో ఆర్టీసీ సంస్థ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచిది కాదని సజ్జనార్‌ హెచ్చరించారు. లైకులు, కామెంట్ల కోసం చేసే ఇలాంటి పిచ్చి పనులు చూసి.. వేరే వాళ్లు కూడా దాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. కనుక సరదా కోసం చేసే ఎడిటెడ్‌ వీడియోలు ఇతరులకు ప్రాణాపాయం కూడా కలిగిస్తాయని వివరించారు సజ్జనార్‌. ఇలాంటి ఘటనలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంటుందని.. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి