Keerthi
TGSRTC: ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు టికెట్లు ఇచ్చే సమయంలో ప్రయాణికులు నుంచి రూ.10 నాణెం తీసుకోవటం లేదు. దీంతో చాలామంది ప్రయాణికులు ఈ సమస్యను ఎదుర్కొవడమే కాకుండా.. ఆర్టీసీ యాజమాన్యంకు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా ఈ సమస్యపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం కీలక ఆదేశాలు జారీ చేసింది.
TGSRTC: ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు టికెట్లు ఇచ్చే సమయంలో ప్రయాణికులు నుంచి రూ.10 నాణెం తీసుకోవటం లేదు. దీంతో చాలామంది ప్రయాణికులు ఈ సమస్యను ఎదుర్కొవడమే కాకుండా.. ఆర్టీసీ యాజమాన్యంకు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా ఈ సమస్యపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Keerthi
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే.. తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. అంతేకాకుండా.. రాష్ట్రంలో ప్రయాణికుల కోసం అదనంగా కొన్ని ప్రత్యేకమైన ఆర్టీసీ బస్సలతో పాటు మెట్రో, డిలాక్స్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది.
ఇక అందుకు తగ్గట్టుగానే ఆర్టీసీ సర్వీసులను విజయవంతంగా నడుపిస్తుంది.కానీ, ఏదోక రూపంలో ఆర్టీసీ ప్రయాణికులు అసౌకర్యంకు గురవుతునే ఉంటారు. ముఖ్యంగా చిల్లర విషయంలో అయితే ఆర్టీసీ కండక్టర్లు కొన్ని నాణెలు చెల్లవనే అపోహలతో ప్రయాణికులకు చెబుతుంటారు. దీంతో చాలా వరకు ఈ సమస్యను ఎదుర్కొన్న ప్రయాణికులు ఆర్టీసీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ సమస్య పై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం తాజాగా ఈ విషయం పై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ఆర్టీసీ బస్సుల్లో రూ.10 నాణెం చెల్లదనే అపోహ చాలామందికి ఉంది. ఇక ఈ విషయం పై ఇప్పటికి దేశవ్యాప్తంగా ప్రచారం జోరుగా కొనసాగుతునే ఉంది. దీంతో చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తులు, ప్రభుత్వ సంస్థల వరకు రూ.10 నాణేలు చెల్లవని అభ్యంతరాలు తెలుపుతున్నాయి. అయితే ఈ విషయం పై స్పందిచంిన ఆర్బీఐ రూ. 10 నాణెం చెల్లుతుందని గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయిన సరే ప్రజల్లో ఈ అపోహ ఇంక పోవటం లేదు. దీని క్రమంగా ఆర్టీసీ బస్సుల్లో కూడా కొందరు కండక్టర్లు రూ.10 నాణెం తీసుకోవటం లేదు. ఇక ఈ సమస్యను ఎదుర్కొన్న చాలామంది ఆర్టీసీ ప్రయాణికులు TGSRTC యజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ సమస్యపై స్పందించిన ఆర్టీసీ యాజామాన్యం కండక్టర్లతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిపో మేనేజర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బస్సుల్లో ప్రయాణికులు ఇచ్చే రూ.10 నాణేలు తీసుకోవాలని ఆర్టీసీ కండక్టర్లను ఆదేశించారు.
అంతేకాకుండా.. రూ.10 కాయిన్‌ను ఆర్బీఐ ఉపసంహరించుకోలేదని.. ఆ కాయిన్‌కు చట్టబద్దత ఉన్నందున ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ప్రయాణికుల వద్ద తీసుకోవాలని ఆదేశాలను జారీ చేసింది. కనుక ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు ఎవరైనా రూ.10 నాణెం ఇచ్చినప్పుడు కండక్టర్ నిరాకరిస్తే.. వెంటనే ఈ విషయాన్ని గుర్తు చేయండి. ముఖ్యంగా రూ.10 నాణెం చెల్లదని ఆర్బీఐ ప్రకటించలేదని, అలాగే ఆర్టీసీ యాజమాన్యం కూడా ఈ రూ.10 నాణెం చెల్లుబాటు అవుతుందని, ప్రయాణికుల దగ్గర నుంచి దీనిని తీసుకోవాలని ఆదేశాలను జారీ చేసిందనే విషయాన్ని గుర్తు చేయండి. మరీ, ఆర్టీసీ ప్రభుత్వం రూ.10 నాణెం తీసుకోవాలనే ఆదేశాలను జారీ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.