iDreamPost

TGSRTC: తెలంగాణలో బస్సు టికెట్‌ ధరలు పెంచుతున్నారా.. అసలు మ్యాటర్‌ ఇది

  • Published Jun 13, 2024 | 9:57 AMUpdated Jun 13, 2024 | 9:57 AM

గత కొన్ని రోజులుగా తెలంగాణలో బస్సు ఛార్జీలు పెంచబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఇంతకు ఇది నిజమేనా.. నిజంగానే టికెట్‌ధరలను పెంచుతున్నారా లేదా తెలియాలంటే ఇది చదవండి..

గత కొన్ని రోజులుగా తెలంగాణలో బస్సు ఛార్జీలు పెంచబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఇంతకు ఇది నిజమేనా.. నిజంగానే టికెట్‌ధరలను పెంచుతున్నారా లేదా తెలియాలంటే ఇది చదవండి..

  • Published Jun 13, 2024 | 9:57 AMUpdated Jun 13, 2024 | 9:57 AM
TGSRTC: తెలంగాణలో బస్సు టికెట్‌ ధరలు పెంచుతున్నారా.. అసలు మ్యాటర్‌ ఇది

గత కొన్ని నెలలుగా తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. అందుకు కారణం మహాలక్ష్మి పథకం కింద ఆడవారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం. దాంతో బస్సుల్లో రద్దీ పెరగడమే కాక.. ఆర్టీసీకి ఆదాయం కూడా భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే.. ఇప్పుడు ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య బాగా పెరిగింది. దాంతో బస్సులన్ని ఫుల్‌ రద్దీగా ఉంటున్నాయి. ఉచిత ప్రయాణం పథకం పట్ల మహిళలు, ఆర్టీసీ యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తుండగా.. మగవారు మాత్రం మండిపడుతున్నారు. దీని వల్ల తాను టికెట్‌ ధర చెల్లించి మరి బస్సుల్లో నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది అని వాపోతున్నారు. రద్దీకి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఆర్టీసీకి సంబంధించి ఓ వార్త జోరుగా ప్రచారం అవుతోంది. అది ఏంటంటే.. త్వరలోనే బస్‌ టికెట్‌ ధరలను పెంచుతారంట. ఆ వివరాలు..

కొన్ని రోజులుగా తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. టోల్ ప్లాజాల వద్ద రేట్లు పెంచిన నేపథ్యంలో.. తెలంగాణలో టోల్ ప్లాజాలున్న మార్గాల్లో నడిచే బస్సుల్లో టికెట్ ధరలను పెంచనున్నారు అంటూ ప్రచారం సాగుతోంది. ఈ రూట్లలో వెళ్లే బస్సు టికెట్‌ ఛార్జీలోని టోల్ రుసుమును మూడు రూపాయల చొప్పున పెంచారంటూ వార్తలు వస్తున్నాయి.. కేంద్రం టోల్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో తెలంగాణలోని ఎక్స్‌ప్రెస్ బస్సులో టోల్ రుసుమును ఒక్కో కౌంటర్‌కు పది నుంచి 13కు, డీలక్స్, లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో 13 నుంచి 16 రూపాయలకు, గరుడ ప్లస్ బస్సుల్లో 14 నుంచి 17 రూపాయలకు, నాన్ ఏసీ స్లీపర్, హైబ్రిడ్ స్లీపర్లో రూ.15 నుంచి రూ.18కి, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ. 20 నుంచి రూ.23కు పెంచినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ వార్తలపై తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది.

ఆర్టీసీ బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదంటూ టీజీఎస్‌ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. సాధారణ ఛార్జీలు యథాతథంగానే ఉన్నాయని తెలిపింది. హైవేలపై టోల్ ఛార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది అని చెప్పుకొచ్చిన తెలంగాణ ఆర్టీసీ.. సెంట్రల్‌ ప్రభుత్వం పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్‌లోని టోల్ సెస్‌ను సవరించుకున్నట్లు తెలిపింది. ఈ సవరించిన టోల్ సెస్ అనేది జూన్ 3వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిందనిట ఆర్టీసీ యాజమాన్యం వివరణ ఇచ్చింది. టోల్ ప్లాజాలున్న రూట్లలోనే టోల్ సెస్‌ను సవరించినట్లు తెలిపింది. అలాగే సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవని ప్రకటనలో పేర్కొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి