iDreamPost
android-app
ios-app

ఆ రిటైర్డ్ RTC ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ స్కీమ్ వర్తింపు, వైద్యానికి 4 లక్షలు..!

TGSRTC: ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను తీపికబురు చెప్పిన సంగతి తెలిసింది. తాజాగా ఆర్టీసీలోని ఉద్యోగులకు కూడా తెలంగాణ సర్కార్ ఓ గుడ్ న్యూస్ అందించింది.

TGSRTC: ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను తీపికబురు చెప్పిన సంగతి తెలిసింది. తాజాగా ఆర్టీసీలోని ఉద్యోగులకు కూడా తెలంగాణ సర్కార్ ఓ గుడ్ న్యూస్ అందించింది.

ఆ రిటైర్డ్ RTC ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ స్కీమ్ వర్తింపు, వైద్యానికి 4 లక్షలు..!

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక  సదుపాయాలను కల్పిస్తుంటాయి. అలానే రిటైర్డ్ ఎంప్లాయిస్ కి కూడా పలు రకాల బెనిఫిట్స్ ను ప్రభుత్వాలు అందిస్తుంటాయి. ఈ క్రమంలోనే తరచూ వారికి గుడ్ న్యూస్ లను అందిస్తుంటాయి. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను తీపికబురు చెప్పిన సంగతి తెలిసింది. తాజాగా ఆర్టీసీలోని రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కూడా తెలంగాణ సర్కార్ ఓ గుడ్ న్యూస్ అందించింది. మరి..పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వ్యవస్థ ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అలానే ఈ సంస్థలో వేలాది మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. తరచూ వారికి ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతుంటారు. తాజాగా పదవీ విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఓ శుభవార్త వచ్చింది. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు రిటైర్డ్ ఎంప్లాయిస్ మెడిక‌ల్ ఫెసిలిటీ స్కీం కింద ల‌భించే బెనిఫిట్స్ సంస్థ వర్తింపజేసింది. గ‌తంలో ఉన్న రూల్స్ లో పలు మార్పులు చేస్తూ కొత్త ఉత్తర్వ్యూలను ఆ సంస్థ జారీ చేసింది. ఈ మేర‌కు మార్పులు చేసిన స‌ర్క్యూల‌ర్‌ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాక‌ర్ రిలీజ్ చేశారు.

ఆరోగ్య కారణాలతో రిటైర్డైన సిబ్బంది, అలానే కారుణ్య నియామకం కింద ఉపాది పొంద‌ని బాధిత జీవిత భాగ‌స్వాములూ ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఈ పథకంలో స‌భ్యత్వాన్ని పొంది ఆ బెనిఫిట్స్ పొందొచ్చు. ఇక కొత్త నిబంధనల ప్రకారం…పథకంకి అర్హులైన వారు జీవిత కాలం వ‌ర‌కు వైద్య ఖ‌ర్చుల‌కు రూ.4 ల‌క్షల వ‌ర‌కు ఉపయోగించుకునే స‌దుపాయాన్ని టీజీఎస్ ఆర్టీసీ సంస్థ కల్పించింది. మరి..తాజాగా ఆ రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం లబ్ధిపొందనున్న కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి.

ఇది ఇలా ఉంటే… శనివారం హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. వాటితో పాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని కూడా మంత్రి ప్రారంభించారు. అనంతరం తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిPonnam Prabhakar, ని ఆయన పరిశీలించారు. వైద్యం కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన ముచ్చటించారు. ఇదే సమయంలో తార్నక ఆర్టీసీ ఆస్పత్రిలో డాక్టర్లతో మంత్రి సమావేశమయ్యారు. సిబ్బందికి అందిస్తోన్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆయన మాట్లాడుతూ…ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య సేవల విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని, తమ కుటుంబంలోని వ్యక్తుల్లా భావిస్తూ సేవలను అందించాలని వైద్యులకు మంత్రి సూచించారు. తార్నాక ఆర్టీసీ ప్రాంగణంలో ప్రారంభించిన వైద్య సదుపాయాలను  ఆర్టీసీ సిబ్బంది వినియోగించుకోవాలన్నారు.