iDreamPost

ఎయిర్ పోర్టు ప్రయాణికులకు గుడ్ న్యూస్! తక్కువ ధరకే AC బస్సులో జర్నీ..

TGS RTC, Airport Route: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు వివిధ రకాల ఆఫర్లను, రాయితీలను ప్రకటిస్తుంది. త్వరలో పల్లె ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. తాజాగా హైదరాబాద్ నగర్ ప్రజలకు ఆర్టీసీ అధికారులు ఓ శుభవార్త చెప్పారు.

TGS RTC, Airport Route: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు వివిధ రకాల ఆఫర్లను, రాయితీలను ప్రకటిస్తుంది. త్వరలో పల్లె ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. తాజాగా హైదరాబాద్ నగర్ ప్రజలకు ఆర్టీసీ అధికారులు ఓ శుభవార్త చెప్పారు.

ఎయిర్ పోర్టు ప్రయాణికులకు గుడ్ న్యూస్! తక్కువ ధరకే AC బస్సులో జర్నీ..

ప్రజలను వారి గమ్యస్థానాల్లో చేర్చడంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోంది. అలానే ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక అనే నిర్ణయాలు తీసుకుంటుంది. అదే విధంగా వివిధ సందర్భాల్లో ప్యాసింజర్లకి ఆర్టీసీలు గుడ్ న్యూస్ చెబుతుంటాయి. తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రయాణికులకు వివిధ రకాల ఆఫర్లను, రాయితీలను ప్రకటిస్తుంది. త్వరలో పల్లె ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. తాజాగా హైదరాబాద్ నగర్ ప్రజలకు ఆర్టీసీ అధికారులు ఓ శుభవార్త చెప్పారు. ముఖ్యంగా ఎయిర్ పోర్టు మార్గంలో ప్రయాణించేవారికి ఇది మంచి ప్రయోజనం అని చెప్పొంచ్చు. మరి.. అసలు సంగతి ఏమిటో ఇప్పుడు చూద్దాం…

హైదరాబాద్ మహానగరంలో శంషాబాద్ విమానాశ్రయంకి ప్రత్యేక  స్థానం ఉంది. ఇక్కడి నుంచి నిత్యం ఎంతో మంది రాకపోకలు సాగిస్తుంటారు. అలానే రోజూ శంషాబాద్ ఎయిర్ పోర్టు మార్గంలో వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. ఈ మార్గంలో ఎక్కువగా ఏసీ బస్సులే కనిపిస్తుంటాయి. అంతేకాక వీటి ధర కూడా కాస్తా ఎక్కువగానే ఉంటుంది. ఇదిఇలా ఉంటే.. శంషాబాద్ ఎయిర్ పోర్టు మార్గంలో ప్రయాణించే వారి కోసం గ్రేటర్ ఆర్టీసీ అధికారులు శుభవార్త చెప్పారు. కేవలం రూ.5 వేలకే పుష్పక్ ఏసీ మంత్లీ జనరల్ బస్​పాస్ ను అందిస్తున్నట్లు తెలిపారు.

శంషాబాద్, ఆరాంఘర్, గచ్చిబౌలి, బాలాపూర్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్ నుంచి పుష్పక్ ఏసీ పాస్ ను తక్కువ ధరకు అందిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ గ్రేటర్ ​అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, గ్రీన్ మెట్రోలగ్జరీ ఏసీ నెల బస్ పాస్ ను 1900 రూపాయిలకే అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పాస్ కేవలం గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులతో పాటు మిగిలి కొన్ని రకాల బస్సులో చెల్లుతుందని తెలిపారు. ముఖ్యంగా సికింద్రాబాద్,- పటాన్​చెరు(219 రూట్), బాచుపల్లి,- వేవ్ రాక్ (195 రూట్), కోఠి-కొండాపూర్(127k) రూట్లలో నడిచే బస్సుల్లో ఈ పాస్ ​చెల్లుతుందని తెలిపారు.

గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లోనే కాకుండా ఈ–మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ సిటీ పరిధిఉన్నంత వరకు ప్రయాణించవచ్చని అధికారులు స్పష్టం చేశారు. అయితే మెట్రో ఏసీ లగ్జరీ బస్​ పాస్ మాత్రం  శంషాబాద్ వైపు తిరిగే పుష్పక్ ఏసీ బస్సుల్లో చెల్లదని చెప్పారు. ఈ కొత్త పాసులు గ్రేటర్ హైదరాబాద్ జోన్ లోని అన్ని బస్సు పాస్ సెంటర్లలో పొందొచ్చని తెలిపారు.  ఉదయం 06.30 నుంచి రాత్రి 08.15 గంటలకు కౌంటర్లు తెరిచి ఉంటాయని అధికారులు వెల్లడించారు. మొత్తంగా విమానశ్రయ మార్గంలో వెళ్లే వారికి ఇది శుభవార్తే అని చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి