iDreamPost
android-app
ios-app

TGPSC గ్రూప్‌ 3 పరీక్ష రాసేవారు జాగ్రత్త.. ఈ తప్పులు చేశారో డీబార్‌ ఖాయం!

  • Published Nov 07, 2024 | 10:16 AM Updated Updated Nov 07, 2024 | 10:16 AM

TGPSC Group 3: పది రోజుల్లో గ్రూప్‌ 3 పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. కాబట్టి అభ్యర్ధులు కచ్చితంగా రూల్స్ తెలుసుకోవాలి.

TGPSC Group 3: పది రోజుల్లో గ్రూప్‌ 3 పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. కాబట్టి అభ్యర్ధులు కచ్చితంగా రూల్స్ తెలుసుకోవాలి.

  • Published Nov 07, 2024 | 10:16 AMUpdated Nov 07, 2024 | 10:16 AM
TGPSC గ్రూప్‌ 3 పరీక్ష రాసేవారు జాగ్రత్త.. ఈ తప్పులు చేశారో డీబార్‌ ఖాయం!

TGPSC గ్రూప్ 3 అభ్యర్థులకు మెయిన్ అప్‌డేట్‌ వచ్చింది. ఇంకో పది రోజుల్లో గ్రూప్‌ 3 పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) రిలీజ్ చేసింది. షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 17, 18 తేదీల్లో ఈ ఎగ్జామ్ జరగనుంది. నవంబర్‌ 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల దాకా పేపర్‌ 1 ఎగ్జామ్ , మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల దాకా పేపర్‌ 2 ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే, నవంబర్‌ 18న పేపర్‌ 3 ఎగ్జామ్ ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుపుతారు. ఇలా మొత్తం 3 పేపర్లకు గ్రూప్‌ 3 ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ ఎగ్జామ్స్ హాల్‌టికెట్లు నవంబర్‌ 10న రిలీజ్ అవుతాయి. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షలకుపైగా అభ్యర్ధులు అప్లై చేసుకున్నారు.గ్రూప్-3 ఎగ్జామ్ పేపర్ 1లో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌, పేపర్‌ 2లో హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ టాపిక్స్, పేపర్‌ 3లో ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులకు పరీక్షలు పెడతారు. రాత పరీక్ష ఆధారంగానే సెలెక్షన్ ఉంటుంది. దీనికి ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ.. మూడు భాషల్లో జరుపుతారు.

ఈ పరీక్షలు ఆఫ్‌లైన్‌ లో జరుగుతాయి. కాబట్టి అభ్యర్ధులు బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌, హాల్‌టికెట్‌తోపాటు.. పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటరుకార్డు, ఆధార్‌కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపుకార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు లో ఏదైనా ఒరిజినల్‌ గుర్తింపు కార్డును పరీక్షకు తీసుకెళ్లాలి.హాల్‌టికెట్లను ఏ4 సైజు పేజీపై మాత్రమే ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ఒకవేళ అభ్యర్థి ఫొటో, సిగ్నేచర్‌ ప్రింట్‌ కాకుంటే ఎగ్జామ్ సెంటర్ కి తమతోపాటు మూడు పాస్‌పోర్టు ఫొటోలపై గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ తీసుకుని వెళ్ళాలి. ఇన్విజిలేటర్‌కు హామీపత్రం ఇవ్వాల్సి ఉంటుంది.ఫస్ట్ సెషన్‌కు ఉదయం 8.30 గంటల నుంచి, సెకండ్ సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఎగ్జామ్ సెంటర్ కి అనుమతిస్తారు. ఉదయం సెషన్‌లో 9.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటలకు గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లో కూడా అనుమతించరు. కాబట్టి అభ్యర్ధులు త్వరగా వెళ్ళడం బెటర్.

అభ్యర్థులు మొదటి పరీక్షకు తీసుకెళ్లిన హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష దాకా తీసుకెళ్లాలి. పరీక్షల తరువాత హాల్‌టికెట్‌ కాపీని, ప్రశ్నాపత్రాలను పడేయకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. డూప్లికేట్‌ హాల్‌టికెట్లను తర్వాత జారీ చేయమని స్పష్టం చేసింది.పరీక్ష సమయంలో ప్రశ్నపత్రం ఓపెన్‌ చేయగానే అందులో అన్ని ప్రశ్నలు ఉన్నాయా? లేదా? ఏమైనా ప్రింటింగ్ మిస్టేక్ ఉందా? ఖచ్చితంగా చెక్‌ చూసుకోవాలి. తప్పుడు గుర్తింపు పత్రాలతో హాజరైనా, ఒకరి పేరిట మరొక అభ్యర్థి పరీక్ష రాసేందుకు వచ్చినా క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం ఖాయం. అలాగే అలాంటి పనులకు పాల్పడితే ఖచ్చితంగా డిబార్‌ చేస్తామని కమిషన్‌ హెచ్చరించింది. ఇదీ సంగతి. కాబట్టి ఈ రూల్స్ తెలుసుకొని అభ్యర్ధులు ముందుగానే జాగ్రత్త పడటం మంచిది. లేదంటే ఇబ్బందులు పడతారు. మరి ఈ రూల్స్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet