Dharani
TGPSC-Cancels CDPO, EO Exam Held In 2023 January: రాష్ట్రంలో నిర్వహించిన మరో రెండు పరీక్షల పేపర్లు కూడా లీక్ అయినట్లు వెల్లడి కావడంతో.. ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
TGPSC-Cancels CDPO, EO Exam Held In 2023 January: రాష్ట్రంలో నిర్వహించిన మరో రెండు పరీక్షల పేపర్లు కూడా లీక్ అయినట్లు వెల్లడి కావడంతో.. ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
Dharani
ప్రభుత్వ ఉద్యోగాలు, ఎంట్రన్స్ టెస్టుల్లో రాణించడానికి నిరుద్యోగులు, విద్యార్థులు.. ఎంత తీవ్రంగా కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. తిండి, నిద్ర మానుకుని రాత్రింబవళ్లు.. సరదాలు అన్ని వదిలేసుకుని… కష్టపడి చదువుతారు. అయితే ఎంత కష్టపడ్డా కూడా చివరకు అదృష్టం కూడా కలిసి రావాలి. సరైన సౌకర్యాలు లేకపోయినా సరే.. ఉన్న అవకాశాలను వాడుకుని.. పరీక్షల్లో రాణించేందుకు వారి వంతు కృషి చేస్తారు. అదుగో అలాంటి వారి పట్ల.. చీడపురుగులుగా మారుతున్నారు కొందరు అధికారులు. లంచానికి ఆశపడి.. పోటీ పరీక్షల పేపర్లను లక్షల రూపాయలకు అమ్ముకుని.. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ముందుగా ఈ వ్యవహారం.. తెలంగాణలో వెలుగు చూసింది. గ్రూప్ 1 పరీక్ష పేపర్‌ను అమ్ముకున్నట్లు స్పష్టం అయ్యింది. దాంతో ఆ పరీక్షను రద్దు చేశారు. ఇక ఈ లీకేజ్ వ్యవహారం.. కేంద్రం ప్రభుత్వం నిర్వహించే పరీక్షలకు కూడా పాకింది. నీట్ పేపర్ లీక్ అవ్వడం.. దానిపై సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తోన్న సంగతి తెలిసిందే.
ఇలా ఉండగా ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో గ్రూప్ 1 మాత్రమే కాక మరో రెండు పరీక్షల పేపర్లు కూడా లీకైనట్లు వెల్లడి కావడంతో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది ఈ రెండు పోటీ పరీక్షలు నిర్వహించగా.. పేపర్ లీకేజ్ కాణంగా వాటిని ఇప్పుడు రద్దు చేస్తున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఇంతకు ఆ పేపర్లు ఏవి.. అసలేం జరిగింది అంటే..
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నిర్విహించిన వివిధ పరీక్షలను రద్దు చేసింది. పేవర్ లీకేజ్ కారణంగా వాటిని రద్దు చేస్తున్నట్లు వెల్లిడించింది. పేపర్ లీకేజ్ కారణంగా 2023లో నిర్వహించిన చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్(సీపీడీవో), ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(ఈవో) పోస్టుల పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.
సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ, సిట్ నివేదికల ఆధారంగా 2023 జనవరి 3,8వ తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఇక ఇదిలా ఉండగా.. తెలంగాణలో రాజకీయం అంతా నిరుద్యుగుల చుట్టూ తిరుగుతుంది. పలు పోటీ పరీక్షలు రద్దు చేయాలని.. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో 1:100 తీయాలని.. గ్రూప్ 2, 3 పోస్టులను పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ కీలక ప్రకటన చేసింది. గ్రూప్ 2 పరీక్షను మరోసారి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే పోస్టుల పెంపుపై ప్రకటన చేస్తామని టీజీపీఎస్‌సీ బోర్డు అధికారులు వెల్లడించారు.