Dharani
తెలంగాణ ప్రజలకు విద్యుత్ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. విద్యుత్ బిల్లుల చెల్లింపు కోసం సరికొత్త మార్గాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..
తెలంగాణ ప్రజలకు విద్యుత్ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. విద్యుత్ బిల్లుల చెల్లింపు కోసం సరికొత్త మార్గాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..
Dharani
కరోనా తర్వాత ఆన్‌లైన్ చెల్లింపులు పెరిగిపోయాయి. పది రూపాయలు మొదలు లక్షల రూపాయల వరకు డిజిటిల్ విధానంలోనే చెల్లింపులు చేస్తున్నాం. కేవలం షాపింగ్ మాత్రమే కాక.. గ్యాస్, బస్సు, రైలు, విమానం, సినిమా టికెట్ బుకింగ్, ఈఎంఐ, కరెంట్ బిల్లులు చెల్లింపులు వంటివి అన్ని ఆన్‌లైన్‌లోనే చేసేస్తున్నాం. అయితే తాజాగా తెలంగాణ విద్యుత్ శాఖ.. కరెంట్ బిల్లులు చెల్లింపుపై కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా బిల్లుల చెల్లింపులు బంద్ అయ్యాయి. ఇకపై కచ్చితంగా డిస్కం వెబ్‌సైట్, టీజీఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లులు చెల్లించాలని అధికారులు సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా విద్యుత్ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. కరెంట్ బిల్లుల చెల్లింపునకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..
కరెంట్ బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్సీడీసీఎల్) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం ఎన్‌సీడీసీఎల్.. క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం కరెంట్ బిల్లు ఇచ్చే పేపర్ కిందనే క్యూఆర్ కోడ్‌ను ముద్రించనున్నట్లు తెలిపారు. అంటే సాధారణంగా.. ఇళ్లలో మీటర్ల నుంచి రీడింగ్ తీసిన తర్వాత బిల్లు పేపర్ ఇస్తారు. ఇక మీదట ఇచ్చే కరెంట్ బిల్లు పేపర్ చివర్లో క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ ద్వారా.. క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కరెంట్ బిల్లును చెల్లించే అవకాశం కల్పించింది ఎన్పీడీసీఎల్.
అయితే ఈ క్యూఆర్ కోడ్ విధానం వెంటనే అమల్లోకి రాదని తెలుస్తోంది. ముందుగా ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా కొన్ని విద్యుత్తు రెవెన్యూ కార్యాలయాల (ఈఆర్‌వో) పరిధిలో అమలు చేయనున్నారు. ఆ తర్వాత దశలవారీగా డిస్కం పరిధిలోని అన్ని జిల్లాల్లో క్యూఆర్ కోడ్ బిల్లులు తీసుకొస్తామంటున్నారు అధికారులు. వినియోగదారులు సులభంగా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు వీలుగా ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఆర్‌బీఐ ఆదేశాలను అనుసరించి.. విద్యుత్ సంస్థలు.. జూలై 1 నుంచి కరెంట్ బిల్లుల చెల్లింపులను ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి యాప్‌ల ద్వారా చెల్లించడం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆయా విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని వినియోగదారులు డిస్కమ్ వెబ్‌సైట్, దాని మొబైల్ యాప్ ద్వారా మాత్రమే కరెంట్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. బిల్లు చెల్లింపుల్లో భద్రత కోసం ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై బిల్లుల చెల్లింపులు మొత్తం భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారానే జరగాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ మేరకు జూలై 1 నుంచి ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చారు.