iDreamPost
android-app
ios-app

తెలంగాణలో వారికి అదిరే శుభవార్త.. నెలకు రూ.6వేలు.. ఎవరికంటే

  • Published Jul 09, 2024 | 9:13 AM Updated Updated Jul 09, 2024 | 9:13 AM

తెలంగాణ ప్రభుత్వం అదిరే శుభవార్తతో ముందుకు వచ్చింది. నెలకు రూ.6 వేలు పొందే అవకాశం కల్పించేందుకు రెడీ అవుతోంది. ఇంతకు ఈ నగదు దేనికి సంబంధించింది అంటే.

తెలంగాణ ప్రభుత్వం అదిరే శుభవార్తతో ముందుకు వచ్చింది. నెలకు రూ.6 వేలు పొందే అవకాశం కల్పించేందుకు రెడీ అవుతోంది. ఇంతకు ఈ నగదు దేనికి సంబంధించింది అంటే.

  • Published Jul 09, 2024 | 9:13 AMUpdated Jul 09, 2024 | 9:13 AM
తెలంగాణలో వారికి అదిరే శుభవార్త.. నెలకు రూ.6వేలు.. ఎవరికంటే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే అనేక హామీలను అమలు చేయగా.. మరికొన్నింటిని వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఆగస్ట్‌ 15 నాటికి 2 లక్షల రూపాయల రుణ మాఫీ పూర్తి చేస్తామని.. అలానే పెట్టుబడి సాయం కింద ఎకరాకు 15 వేల రూపాయలు అందించే రైతు భరోసా విధివిధానాలు రూపొందించే పనిలో ఉన్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ సర్కార్‌ కొందరికి భారీ శుభవార్త చెప్పింది. నెలకు రూ.6 వేలు పొందే అవకాశం కల్పించడానికి రెడీ అవుతోంది. తాజాగా దీనిపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువైన నాటి నుంచి..  కొత్త పెన్షన్ల కోసం అర్హులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వారికి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరు కోసం అర్హుల జాబితాను సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగులో ఉన్న పెన్షన్లతో పాటు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నివేదిక సమర్పించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. తమ ప్రభుత్వం చేయూత పథకం కింద పంపిణీ చేసే పింఛన్ల మొత్తాన్ని పెంచనుందని స్పష్టం చేశారు. అర్హుల జాబితా సిద్ధం కాగానే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని సీతక్క వెల్లడించారు.

ప్రస్తుతం తెలంగాణలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ అందిస్తున్నారు. వీరిలో వృద్ధులు, ఒంటరి మహిళలు, వేర్వేరు రంగాలకు చెందిన కార్మికులకు ఆసరా పింఛను రూ.2,016, దివ్యాంగ పింఛను రూ.3,016 గా ఇస్తున్నారు.

అయితే తాము అధికారంలోకి వస్తే.. ఈ మెుత్తాన్ని పెంచుతామని ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమను గెలిపిస్తే.. చేయూత పథకం కింద వికలాంగులకు రూ. 6 వేలు, మిగిలిన వారికి నెలకు రూ. 4 వేలు పెన్షన్‌ ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఇప్పుడు ఈ హామీని అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

చేయూత పథకానికి అర్హులు..

  • చేయూత పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.
  • ఈ పథకానికి లబ్ధిదారుగా ఎంపిక కావాలంటే.. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందినవారై ఉండాలి
  • దరఖాస్తుదారు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, డయాలసిస్, ఫైలేరియా, ఎయిడ్స్ రోగులలో ఏదైనా ఒక వర్గానికి చెందినవారై ఉండాలి.
  • అందుకు సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

చేయూత పథకం కోసం అవసరమైన పత్రాలు

  • ఆధార్ కార్డ్
  • వయస్సు నిర్ధారణ కోసం బర్త్‌ సర్టిఫికెట్‌
  • క్యాస్ట్‌ సర్టిఫికెట్‌
  • ఆదాయ ధృవీకరణ పత్రం
  • అంగవైకల్యాన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వ వైద్యులు జారీ చేసిన అంగవైకల్యం పత్రం
  • రేషన్ కార్డు
  • బ్యాంక్ పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
  • ఇవి కాకుండా పథకానికి సంబంధించి అధికారులు అడిగే ఇతర పత్రాలు అవసరం అవుతాయి.