iDreamPost
android-app
ios-app

Rythu Runa Mafi: రుణమాఫీపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. మరో రెండు రోజుల్లోనే..

  • Published Jul 10, 2024 | 9:20 AM Updated Updated Jul 10, 2024 | 12:17 PM

తెలంగాణ రైతులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న రుణమాఫీపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రెండు రోజుల్లోనే దీనిపై కీలక అప్డేట్‌ రానుంది అని తెలస్తోంది.

తెలంగాణ రైతులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న రుణమాఫీపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రెండు రోజుల్లోనే దీనిపై కీలక అప్డేట్‌ రానుంది అని తెలస్తోంది.

  • Published Jul 10, 2024 | 9:20 AMUpdated Jul 10, 2024 | 12:17 PM
Rythu Runa Mafi: రుణమాఫీపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. మరో రెండు రోజుల్లోనే..

ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ.. తాము అధికారంలోకి వస్తే.. ఒకేసారి 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ హామీ పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఆ దిశగా మార్గదర్శకాలు రెడీ చేస్తున్నారు. దీనికి కేబినెట్‌ కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల్లోనే పంట రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. మార్గదర్శకాలు ప్రకటించిన వెంటనే వాటికి అనుగుణంగా అర్హుల జాబితా సిద్ధం చేసి.. లబ్దిదారులందరి రుణాలు మాఫీ చేయటం రోజుల వ్యవధిలోనే జరిగిపోనుంది అని చెప్పుకొచ్చారు

ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు.. రైతు రుణమాఫీపై తెలంగాణ అధికారులు కసరత్తు ప్రారంభించారు. అయితే.. ఈ రుణ మాఫీపై మంత్రివర్గంతో సమావేశం నిర్వహించి.. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు. ఇక రుణమాఫీ పథకం అమలు కోసం సుమారు 31 వేల కోట్లు అవసరమవుతాయని కేబినెట్ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇప్పటికే ప్రభుత్వం ఈ నిధుల సమీకరణ దిశగా సర్కార్‌ ప్రయత్నాలు మొదలుపెట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

రైతు భరోసాపై..

ఇక తెలంగాణ రైతులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న రైతు భరోసా పథకంపై కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసాపై బుధవారం (జులై 10న) ఖమ్మం జిల్లా నుంచి అభిప్రాయాల సేకరణ ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. దీని ద్వారా.. రైతులు, ఉద్యోగులు, మేధావులు, రైతు సంఘాల నేతల నుంచి ఈ పథకం అమలుపై అభిప్రాయాలు స్వీకరించనున్నట్టు వెల్లడించారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో రైతు భరోసా విధివిధానాల రూపకల్పన కోసం రేవంత్‌ సర్కార్‌ ఇటీవలే కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఈ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం ఇది రైతు భరోసా విధివిధానాలపై కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగానే.. రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. అందరి దగ్గరి నుంచి అభిప్రాయలు సేకరించి త్వరలోనే ఈ పథకానికి సంబంధించి తుది రిపోర్ట్‌ను తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనుంది. ఆ తర్వాతనే ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయనుంది.