iDreamPost
android-app
ios-app

TG: తెలంగాణలో జూన్‌ 1 నుంచి కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌.. ఇలా చేస్తే రూ.25 వేలు ఫైన్‌

  • Published May 29, 2024 | 8:22 AMUpdated May 29, 2024 | 8:22 AM

తెలంగాణ వాహనదారులు ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు చేసినా.. భారీ ఎత్తున జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. జూన్‌ 1 నుంచి తెలంగాణలో కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. ఆ వివరాలు..

తెలంగాణ వాహనదారులు ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు చేసినా.. భారీ ఎత్తున జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. జూన్‌ 1 నుంచి తెలంగాణలో కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. ఆ వివరాలు..

  • Published May 29, 2024 | 8:22 AMUpdated May 29, 2024 | 8:22 AM
TG: తెలంగాణలో జూన్‌ 1 నుంచి కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌.. ఇలా చేస్తే రూ.25 వేలు ఫైన్‌

నెల ప్రారంభం అయ్యిందంటే చాలు కొన్ని కీలక అంశాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. మరీ ముఖ్యంగా గ్యాస్‌ ధరలు, ఐటీ పేయర్స్‌కు సంబంధించిన నియమాలు, బ్యాకింగ్‌, ఫైనాన్స్‌ కంపెనీలకు సంబంధించి కొత్త రూల్స్‌ అమల్లోకి వస్తుంటాయి. మరో మూడు రోజుల్లో జూన్‌ నెల ప్రారంభం కానుంది. దాంతో అనేక అంశాల్లో మార్పులు రానున్నాయి. అలానే జూన్‌ 1 నుంచి కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ అమల్లోకి రాబోతున్నాయి. ఇక మీదట వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. జేబుకు చిల్లు పడాల్సిందే.. పర్స్‌ ఖాళీ అవుతుందని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంతకు కొత్తగా అమల్లోకి రాబోయే రూల్స్‌ ఏంటో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణలో జూన్‌ 1 నుంచి కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. నియమాలు ఉల్లంఘిస్తే.. భారీ ఎత్తున జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మీ పర్సు ఖాళీ అవ్వడం ఖాయం అంటున్నారు. ఇకపై అతి వేగంతో వాహనం నడుపుతూ, పోలీసులకు దొరికితే రూ.1,000-రూ.2,000 దాకా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అలాగే.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికిల్ నడిపితే రూ.500 జరిమానా వేస్తారు. మైనర్ వాహనం నడిపితే రూ.25 వేలు జరిమానా విధిస్తారు. అంతేకాదు.. మైనర్‌కి 25 ఏళ్ల వయసు వచ్చేవరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధిస్తారు. ఇందుకోసం ఎంవీఐ చట్టంతోపాటూ.. పోలీస్ యాక్ట్ ప్రకారం శిక్షలు అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు.

New traffic rules in Telangana from June

ఇది వరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడం చాలా కష్టమయ్యేది. ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఐతే ఇటీవల కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలోని రోడ్డు రవాణా సంస్థ జారీ చేసిన రూల్స్‌ ప్రకారం.. ఇక మీదట ప్రైవేటు డ్రైవింగ్‌ సంస్థలే.. డ్రైవింగ్‌కు సంబంధించి టెస్టులు నిర్వహించి.. సర్టిఫికెట్లు జారీ చేస్తాయి. దీని ఆధారంగా.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఆర్టీవో ఆఫీసుకు వెళ్లే పని లేకుండా.. ఎలాంటి టెస్ట్‌ లేకుండా.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందవచ్చు. అయితే ఇలా డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేసే సంస్థలకు సంబంధించి కూడా కేంద్ర రోడ్డు రవాణా సంస్థ కొన్ని మార్పులు చేసింది.

ఇక మీదట ఫోర్ వీల్ డ్రైవింగ్ టెస్ట్ చేసే సంస్థకు 3 ఎకరాల భూమి ఉండాలి. అక్కడ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించడానికి నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి ఉండాలి. అలానే డ్రైవింగ్ ట్రైనింగ్ ఇచ్చేవారు సైతం హైస్కూల్ చదువు పూర్తి చేయడమే కాక డ్రైవింగ్‌లో 5 ఏళ్ల అనుభవం ఉండాలి. అంతేకాక వారికి.. బయో మెట్రిక్ టెక్నాలజీపై అవగాహన కలిగివుండాలి.

లైట్ వెహికిల్ డ్రైవింగ్ ట్రైనింగ్ 4 వారాలు ఉండాలి. కనీసం 29 గంటల ట్రైనింగ్ ఉండాలి. ఇందులో 21 గంటలు ప్రాక్టికల్, 8 గంటలు థియరీ ఉండాలి. ఇలాంటి రూల్స్ అన్నీ పాటించే సంస్థలు మాత్రమే డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేయాల్సి ఉంటుంది. కనుక వాహనదారులు రోడ్డు మీదకు వచ్చే ముందు.. ఒకటికి పది సార్లు చెక్‌ చేసుకుని.. అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని బయటకు రావాలి అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి