Dharani
తెలంగాణ సర్కార్ భారీ శుభవార్త అని చెప్పవచ్చు. వారు ఉచితంగా నెలకు 5 వేల రూపాయలు పొందే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. ఇంతకు ఇది ఏ పథకం.. దీనికి అర్హులు ఎవరంటే.
తెలంగాణ సర్కార్ భారీ శుభవార్త అని చెప్పవచ్చు. వారు ఉచితంగా నెలకు 5 వేల రూపాయలు పొందే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. ఇంతకు ఇది ఏ పథకం.. దీనికి అర్హులు ఎవరంటే.
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. విద్యార్థుల కోసం కూడా అనేక పథకాలు తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్నట్లు ప్రకటించిన రేవంత్ సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసకుంది. కొందరికి ప్రతి నెల రూ.5 వేలు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. పైగా ఈ పథకం నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిసింది. ఇంతకు ఇది ఏ స్కీమ్.. దీనికి ఎవరు అర్హులు.. ఎలా అప్లై చేసుకోవాలి వంటి తదితర వివరాలు మీ కోసం..
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. వారికి ప్రతి నెల 5 వేల రూపాయలు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే అందరికి కాదు. గ్రూప్ 1 మెయిన్స్‌కు ఎంపిక అయిన బీసీ అభ్యర్థులు ఇందుకు అర్హులు. వీరికి ఈ నెల అనగా జూలై 22 నుంచి ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ వెల్లడించింది. దీని వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు భారీ ఊరట లభించనుంది. ఖమ్మం, హైదరాబాద్‌లోని సెంటర్లలో 75 రోజుల పాటు కోచింగ్ కొనసాగుతుందని బీసీ స్టడీ సర్కిల్ వెల్లడిచింది.
అంతేకాక వీరికి ఉచిత కోచింగ్‌తో పాటు నెలకు రూ. 5 వేలు స్టైఫండ్ కూడా చెల్లిస్తామని బీసీ స్టడీ సర్కిల్ ప్రకటించింది. అయితే ఇందుకు కొన్ని షరతులు విధించింది. అవి ఏంటంటే.. నెలకు రూ. 5 వేలు పొందాలంటే.. సదరు అభ్యర్థి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 5 లక్షల లోపు ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే అర్హులు కాదు. ఇందుకోసం ఈ రోజు అనగా జూలై 10 నుంచి 19 వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. https://tgbcstudycircle.cgg.gov.in/ వెబ్‌సైట్ ద్వారా అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. స్టైఫండ్‌తో పాటుగా ఉచితంగానే శిక్షణ కూడా పొందొచ్చు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరింత సమాచారం కోసం 040-24071188 నంబరులో సంప్రదించాలని తెలిపారు.
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. మెయిన్స్కు 1:50 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మొత్తంగా 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్‌కు అర్హత సాధించారు. అంతేకాక మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ఇదిల