Dharani
TG Dsc 2024-2 Exams On Same Day, 1 Examination Center: తెలంగాణలో డీఎస్సీ పరీక్ష రాయబోయే అభ్యర్థులకు భారీ ఊరట కలిగించే ప్రకటన చేసింది ప్రభుత్వం. ఆ వివరాలు..
TG Dsc 2024-2 Exams On Same Day, 1 Examination Center: తెలంగాణలో డీఎస్సీ పరీక్ష రాయబోయే అభ్యర్థులకు భారీ ఊరట కలిగించే ప్రకటన చేసింది ప్రభుత్వం. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో పోటీ పరీక్షల నిర్వహణ అంశం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. మరీ ముఖ్యంగా డీఎస్సీ, గ్రూప్స్ అభ్యర్థులు.. పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ.. రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేశారు. నిరుద్యోగల నిరసనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు.. నిరుద్యోగుల ముసుగులో పరీక్షలు వాయిదా వేయాలని ఆందోళన చేస్తున్నారని.. దాని వాల్ల వారు మరో 100 కోట్లు వెనకేసుకోవచ్చని ఆశిస్తున్నారని.. కానీ ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలను వాయిదా వేయమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగానే.. డీఎస్సీ పరీక్షల నిర్వహణకు అధికారులు రెడీ అయ్యారు. ఇప్పటికే హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు. ఈక్రమంలో డీఎస్సీ అభ్యర్థులకు భారీ ఊరట కలిగించే ప్రకటన వెలువడింది. ఆ వివరాలు..
తెలంగాణలో మరో నాలుగు రోజుల్లో డీఎస్సీ 2024 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎగ్జామ్ వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం.. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. ఒకే రోజు రెండు సబ్జెక్ట్‌లకు సంబంధించిన డీఎస్సీ పరీక్ష ఉంటే.. వారంతా ఉదయం ఎగ్జామ్ రాసిన చోటే.. రెండో పరీక్షకు కూడా హాజరుకావొచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఎగ్జాం సెంటర్ల విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు తెలియజేశారు. కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక చోట పరీక్ష ఉంటే.. మధ్యాహ్నం మరో చోట ఇంకో పరీక్ష ఉంది. అభ్యర్థులు నాన్ లోకల్ పోస్టులకు అప్లై చేయడంతో వారికి వేరే జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించారు.
దీనిపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడంతో.. స్పందించిన విద్యాశాఖ అధికారులు.. ఒకేరోజు వేర్వేరే చోట పరీక్ష రాయాల్సి వచ్చిన అభ్యర్థులకు ఊరట కలిగించే ప్రకటన చేశారు. అలాంటి వారు ఒకే రోజు ఒకే ఎగ్జామ్ సెంటర్‌లో రెండు పరీక్షలు రాయవచ్చని.. అందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఒకే రోజు వేరువేరు జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు పడిన వారికి హాల్‌టికెట్లు మార్చి.. మళ్లీ జారీ చేస్తామని చెప్పుకొచ్చారు.
ఒక సబ్జెక్టు తెలుగు, అదే సబ్జెక్టు హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసి ఉంటే.. ప్రధాన మాధ్యమంలో వచ్చిన మార్కులను రెండో దానికి కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా విద్యాశాఖ స్పష్టం చేసింది. కాగా జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్ విధానంలో డీఎస్సీ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 2,79,966 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నారు.