iDreamPost
android-app
ios-app

గంజాయి ఇచ్చి ఏడాదిగా యువతిపై అత్యాచారం! ఈ దారుణం ఎక్కడో కాదు!

  • Published Mar 25, 2024 | 4:00 PM Updated Updated Mar 25, 2024 | 4:00 PM

నగరంలో రోజు రోజుకి డ్రగ్స్ ముఠాల దందా ఎక్కువైపోతుంది. చివరికి స్కూల్ లో చదువుతున్న పిల్లలను కూడా ట్రాప్ చేసి ఈ గంజాయి మత్తుకు బానిసలు చేస్తున్నారు. ఈక్రమంలోనే మత్తుకు బానిసలైన వారికి డబ్బు ఆశను చూపించి రేవ్ పార్టీల పేరుతో వ్యభిచారానికి తరలిస్తున్నారు. తాజాగా ఇలాంటి షాకింగ్ ఘటనే ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది.

నగరంలో రోజు రోజుకి డ్రగ్స్ ముఠాల దందా ఎక్కువైపోతుంది. చివరికి స్కూల్ లో చదువుతున్న పిల్లలను కూడా ట్రాప్ చేసి ఈ గంజాయి మత్తుకు బానిసలు చేస్తున్నారు. ఈక్రమంలోనే మత్తుకు బానిసలైన వారికి డబ్బు ఆశను చూపించి రేవ్ పార్టీల పేరుతో వ్యభిచారానికి తరలిస్తున్నారు. తాజాగా ఇలాంటి షాకింగ్ ఘటనే ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది.

  • Published Mar 25, 2024 | 4:00 PMUpdated Mar 25, 2024 | 4:00 PM
గంజాయి ఇచ్చి ఏడాదిగా యువతిపై అత్యాచారం! ఈ దారుణం ఎక్కడో కాదు!

నగరంలో రోజు రోజుకి డ్రగ్స్ ముఠాల దందా ఎక్కువైపోతుంది. వీటిని అంతమొందించేందుకు ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నిస్తుంటే.. ఇది అంతకంతకు నగరంలో చేప కింద నీరులా విస్తరిస్తుపోతుంది. ఇప్పటికే గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్ధలను కొంతమంది ముఠా రహస్యంగా నడిపిస్తుంది. అయితే ఈ దందాలో ఎక్కువ శాతం యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వీరితో పాటు ఈ డ్రగ్స్ ముఠాల వలలో విద్యార్థులు చివరికి మైనర్లను సైతం మత్తుకు బానిసలుగా మార్చి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మొదట వారికి మాయమాటాలు చెప్పిన ముఠా ఆ తర్వాత.. వారిని గంజాయి మత్తుకు బానిసలను చేస్తారు. ఇక మత్తుకు బానిసలైన వారికి గంజాయి, డబ్బు ఆశ చూపించి రేవ్ పార్టీల పేరుతో వ్యభిచారానికి తరలిస్తుంటారు. తాజాగా ఇలాంటి షాకింగ్ ఘటనే నగరంలో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

స్కూల్ లో చదువుతున్న కొంతమంది పిల్లలను ట్రాప్ చేస్తున్న ఓ ముఠా.. వారిని గంజాయికి బానిసలులా చేస్తోంది. ఈ క్రమంలోనే మత్తుకు బానిసైన వారి డబ్బు ఆశ చూపించి రేవ్ పార్టీల పేరుతో వ్యభిచారానికి తరలిస్తున్నారు. తాజాగా ఈ ముఠా వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విస్తురపోయే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.జగిత్యాల జిల్లాలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి ట్రాప్ చేసిన ఓ ముఠా గంజాయికి బానిసలు చేసింది. ఈ క్రమంలోనే మత్తుకు బానిసైన ఆ బాలికకు చాక్లెట్ల రూపంలో గంజాయి ఇచ్చేవారు. అలా రోజు ఆ మత్తుకు బానిసైన బాలికను.. గంజాయి ఆశచూపి, రేవ్ పార్టీల పేరుతో వ్యభిచారానికి తరలిస్తున్నారు. ఇక ఈ క్రమంలోని మత్తుకు బానిసైన ఆ అమ్మాయి వింతవింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అయితే మొదట్లో ఈ విషయాన్నిఆ బాలిక తల్లిదండ్రుల అంతగా గమనించ లేదు. కానీ రాను రాను ఆ బాలిక మరి విచిత్రంగా ప్రవర్తిస్తుండటంతో.. తండ్రికి అనుమానం వచ్చింది. దీంతో ఎందుకిలా ప్రవర్తిస్తుందో తండ్రికి అనుమానం వచ్చి ఆరాతీయగా.. ఆమెకు గంజాయికి అలావాటు పడిందని తండ్రికి తెలిసింది. దీంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇక ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శిశు సంరక్షణ కమిటీ.. వెంటనే దర్యాప్తు చేపట్టింది. ఈ విచారణలో భాగంగానే మరిన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎందకుంటే.. ఈ మత్తులో బాధిత అమ్మాయి కాకుండా.. మరో 10 మంది పదో తరగతి చదువుతున్న బాలికలు బానిసలుగా ఉన్నరని తేలింది.ఇక ఈ మత్తుకు బానిసలైన వారంతా మధ్య తరగతి కుటుంబాలకుచెందినవారిగా గుర్తించారు. దీంతో అసలు ఈ అమ్మాయిలకు ఎక్కడి నుంచి గంజాయి అందిందని మరింత లోతుగా విచారణ జరపగా.. దీని వెనుక ఓ సెక్స్ రాకెట్ ముఠా ఉన్నట్టు వెలుగులోకొచ్చింది. కాగా, ఆ ముఠా బాలికలను గంజాయికి బానిసలను చేయడమే కాకుండా.. వారిని హైదరాబాద్‌లోని రేవ్ పార్టీలకు కూడా తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఇక అలా వెళ్లిన ప్రతి పార్టీకి గాను ఈ మూఠా రూ.30 వేలు చెల్లిస్తున్నట్లు వెల్లడైంద. ఈ తరుణంలోనే.. నార్కొటిక్ బ్యూరో అధికారులు రంగంలోకి దిగి ఆ సెక్స్ రాకెట్ ముఠాపై లోతుగా దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగానే జాగిత్యాల జిల్లా ఓ గ్రామం శివారులో.. ఈ అమ్మాయిలకు గంజాయికి బానిసలు చేసే వారిలో ప్రధాన నిందితులుగా ప్రేమ్, వెంకటేశ్ , నితిన్ గా పోలీసులు గుర్తించారు. ఇక వారి ముగ్గురిపై పోక్సో, NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే భాదితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఈ సంచలన ఘటన బయటపడటంతో రెండు తెలుగు రాష్ట్రల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మరి, ఈ కేసు పై మరిన్నీ నిజాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap