iDreamPost

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. లక్షల మందికి ఊరట!

TS Government Key Decision: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.. దీంతో లక్షల మందికి ఎంతో ఊరట కలగబోతుంది.

TS Government Key Decision: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.. దీంతో లక్షల మందికి ఎంతో ఊరట కలగబోతుంది.

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. లక్షల మందికి ఊరట!

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెడుతూ.. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానం ప్రకారం.. ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేశారు. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఆరు గ్యారెంటీ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించారు. తాజాగా తెలంగాణ సర్కార్  మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటీ అన్నవిషయం గురించి తెలుసుకుందాం.

తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి తనదైన దూకుడు కొనసాగిస్తున్నారు. పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు మరంత చేరువ అవుతున్నారు. తాజాగా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ తీపి కబురు అందించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) నిర్వహణకు ఆమోదం తెలిపింది. అంతేకాదు మెగా డీఎస్సీ కన్నా ముందుగానే టెట్ నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కమీషనర్ కు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో త్వరలో టెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మూడు లక్షల మంది నిరుద్యోగులకు ఊరట కలగనుంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీఎస్సీ కి ముందు టెట్ నిర్వహించాలని టెట్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పరీక్షలపై మంత్రి రాజనర్సిహ అధ్యక్షతన సబ్ కమిటీ ఏర్పాటు చేయగా.. ఈ రోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టెట్ నిర్వహణకు ఆమోదం తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం అయ్యింది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్, 727 భాషా పండితులు, 182 పీఈటీ, 6,508 ఎస్జీటీ, స్పెషల్ ఎడ్యూకేషన్ కు సంబంధించి 220 స్కూల్ అసిస్టేంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. ఈ శుభవార్త విన్న నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి