iDreamPost
android-app
ios-app

మేడమ్ దొంగ ఏడుపు.. ఇంట్లో ఎక్కడ పట్టినా నోట్ల కట్టలే!

  • Published Feb 20, 2024 | 7:24 PM Updated Updated Feb 20, 2024 | 7:24 PM

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలోని ఇంజినీర్ జగజ్యోతి. అయితే ఆ తర్వాత ఆమె ఆడిన నాటకాలు చూస్తే.. మీరు ముక్కునవేలేసుకుంటారు.

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలోని ఇంజినీర్ జగజ్యోతి. అయితే ఆ తర్వాత ఆమె ఆడిన నాటకాలు చూస్తే.. మీరు ముక్కునవేలేసుకుంటారు.

మేడమ్ దొంగ ఏడుపు.. ఇంట్లో ఎక్కడ పట్టినా నోట్ల కట్టలే!

గౌరవప్రదమైన పదవిలో ఉంటూ కొందరు నీచమైన పనులు చేస్తూ ఉంటారు. తాజాగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలోని ఇంజినీర్ జగజ్యోతి. అవినీతి చేస్తూ.. అడ్డంగా దొరికిపోవడంతో తనలో ఉన్న నటిని బయటకి తీసింది. దొరకగానే ఏడుపుతో లంకించుకున్న ఆమె మరో నాటకానికి తెరలేపింది. దీంతో అనుమానం వచ్చి.. అధికారులు విచారణ చేపడితే.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

నటీ, నటులు సినిమాల్లోనే ఉంటారు అనుకుంటే మనం పొరపడ్డట్లే. ఈ సమాజంలో ఎంతో మంది ఆస్కార్ లెవల్ నటులు ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు వారిలో ఉన్న నటన తన్నుకుంటూ బయటకివస్తుంది. తాజాగా ఓ అధికారిని తనలో ఉన్న నటిని బయటకితీసింది. అసలు విషయం ఏంటంటే? రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం ఆఫీసర్ జగజ్యోతి కాంట్రాక్టర్ దగ్గర ఒక్క సంతకం కోసం ఏకంగా రూ. 84 వేలు లంచం డిమాండ్ చేసింది. ఆ డబ్బును పుచ్చుకునే క్రమంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం తెలిసిందే.

అయితే అధికారులు ఆమెను క్యాష్ తో పాటు పట్టుకోగానే.. ఏడవడం స్టార్ట్ చేసింది. ఆమెను అరెస్ట్ చేసి.. కోర్టుకు హాజరుపర్చేందుకు రెడీ అవుతున్న క్రమంలోనే.. అసలు కథను మెుదలుపెట్టింది జగజ్యోతి. గుండెనొప్పి అంటూ అధికారులను పరుగులు పెట్టించింది. ఆమె యాక్టింగ్ చూసి నిజంగానే గుండెనొప్పి వచ్చిందా? అని అధికారులే షాక్ కు గురైయ్యారు. దీంతో ఆమెకు వైద్యపరీక్షలు అన్నీ నిర్వహించగా.. నార్మల్ గానే వచ్చాయి. అనంతరం ఏదో తేడాగా ఉందే.. అని అనుమానం రావడంతో.. అధికారులు తమదైన స్టైల్లో ఆమె ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఇక్కడే అసలు బండారం బయటపడింది.

జగజ్యోతి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నోట్ల కట్టలు కనిపించడంతో కంగుతిన్నారు అధికారులు. ఆమె ఇంట్లో రూ. 65 లక్షల నగదుతో పాటుగా నాలుగు కిలోల బంగారం బయటపడ్డాయి. వీటితో పాటుగా ఫ్లాట్లు, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మెుత్తం సుమారు రూ. 15 కోట్ల వరకు ఉంటుందని ఆఫీసర్స్ తెలిపారు. జగజ్యోతి నాటకం బయటపడటంతో.. ఏసీబీ కోర్టు ఆమెకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను చంచల్ గూడా జైలుకు తరలించారు. మరి అడ్డంగా దొరికి.. దొంగనాటకాలు ఆడిన ఈ అవినీతి అధికారిణిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: మీది మొత్తం 1000 అయ్యింది.. కుమారీ ఆంటీ డైలాగ్ తో HYD సిటీ పోలీసులు డ్యూటీ!