TET ఫలితాలు వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి

టెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. కొద్ది సేపటి క్రితం అధికారులు ఫలితాలను విడుదల చేశారు.

టెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. కొద్ది సేపటి క్రితం అధికారులు ఫలితాలను విడుదల చేశారు.

ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకునే వారు బీఈడీ కోర్సులు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్షలో క్వాలిఫై కావాలి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులో ఉత్తీర్ణులైన వారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం నిర్వహించే డీఎస్సీ పరీక్షకు అర్హత సాధిస్తారు. అయితే ఈ ఏడాది టెట్ పరీక్షను నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. లక్షలాది మంది అభ్యర్థులు టెట్ కు అప్లై చేసుకున్నారు. కాగా టెట్ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం మే 20వ తేదీ నుంచి జూన్ 2 వరకు నిర్వహించింది. మొదటి సారిసగా ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టీఎస్ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి.

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఇవ్వాళ అనగా జూన్ 12న టెట్ ఫలితాలు విడుదల చేశారు అధికారులు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను https://tstet2024.aptonline.in/tstet/ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ జర్నల్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 15వ తేదీన టెట్ నోటిఫికేషన్‌ వెలువడగా.. పేపర్‌-1కి 99,958 మంది.. పేపర్‌-2కి 1,86,423 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఇక టెట్ పరీక్షకు పేపర్‌-1కి 86.03 శాతం మంది.. పేపర్‌-2కి 82.58 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13% అర్హత నమోదుకాగా.. పేపర్-2లో 34.18 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. తెలంగాణ టెట్‌ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. ఈ టెట్‌ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు అర్హులవుతారు. పేపర్‌-2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులవుతారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభంకాగా జూన్ 20తో గడువు ముగియనుంది. జులై 17 నుంచి 31 వరకు టీఎస్ డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Show comments