SNP
Telangana, New Emblem: తెలంగాణ రాష్ట్రానికి కొత్త చిహ్నం ఏర్పాటు చేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక చిహ్నాన్ని ఫైనల్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఆ కొత్త లోగో విశేషాలు, అర్థాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Telangana, New Emblem: తెలంగాణ రాష్ట్రానికి కొత్త చిహ్నం ఏర్పాటు చేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక చిహ్నాన్ని ఫైనల్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఆ కొత్త లోగో విశేషాలు, అర్థాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగాకా.. 2014లో అప్పటి టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొత్త రాష్ట్రం కోసం తెలంగాణ చిహ్నాన్ని రూపొందించింది. పదేళ్లపాటు అదే చిహ్నాన్ని కొనసాగించింది. ఇప్పుడు 2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాత చిహ్నం స్థానంలో తెలంగాణ కొత్త అధికారిక చిహ్నం రూపొందించే పనిలో ఉంది. ఈ క్రమంలోనే ఓ చిహ్నం నమూనాను ఫైనల్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త లోగో కూడా బాగుందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. చాలా మంది నెటిజన్లు లోగోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పాత లోగోలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ ఉండేవి. వాటి స్థానంలో కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని పెట్టింది. అయితే.. కొత్త లోగోలో అసలు ఏం ఏం ఉన్నాయి. అవి ఎందుకు పెట్టారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నంలో కచ్చితంగా ఉండాల్సిన మూడు సింహాల ‘సత్యేమవ జయేతే’ మన దేశ జాతీయ చిహ్నం(రాజముద్ర)ను పైన ఉంచారు. దాని కింద హైదరాబాద్‌లో ఉన్న అమరవీరుల స్థూపం నమూనాను పొందుపర్చారు. వాటి చుట్టూ వరి కంకులు వచ్చేలా డిజైన్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వరిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. పైగా వరి మన ఆహారంలో ఎక్కువగా వినియోగిస్తాం. రైతులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ.. వరి కంకులను చిహ్నంలో పెట్టారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌తో పాటు హిందీ భాషలో కూడా రాశారు. పాత చిహ్నంలో హిందీ లేదు.
తెలంగాణ ప్రభుత్వం అని నాలుగు భాషల్లో ఉన్న పదాల చుట్టూ.. ఒక సర్కిల్ ఉంది. అందులో పై లైన్ కాషయం రంగులో, కింది(లోపలి) లైన్ ఆకపచ్చ రంగులో ఉంది. ఇది జాతీయ జెండాకు గుర్తుగా వాడారని అనుకోవచ్చు. అయితే.. కాంగ్రెస్ పార్టీ జెండా కూడా అదే రంగులో ఉండటంతో.. కొంతమంది అది వాళ్ల పార్టీ రంగు కాబట్టి అలా పెట్టారని కూడా అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అని నాలుగు భాషాల్లో రాసిన వాని విడదీసేందుకు రెండు చుక్కలు, కింద మాత్రం ఒక డిజైన్ లాంటింది పెట్టారు. దానికి అర్థమేంటో ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది. మరి తెలంగాణ కొత్త చిహ్నం అంటూ ప్రచారంలో ఉన్న ఈ లోగోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#telangana #emblem row @DeccanChronicle @oratorgreat @vamsi_scribe #Hyderabad pic.twitter.com/zVaYRJOCKw
— Nabinder Bommala (@Nabinder_B) May 30, 2024