రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఇకపై ఎకరం వరికి రూ.45 వేలు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంట రుణాలపై రైతులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అదేమిటంటే..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంట రుణాలపై రైతులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అదేమిటంటే..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం ఇచ్చి హామీలను నేరవేర్చడంలో చకచక ముందుకు సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి భాద్యతలను చెపట్టిన నుంచి రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పుట్టినిల్లుగా మారింది.ఈ క్రమంలోనే ..రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను అమలు చేశారు. అలాగే పేదలకు అండగా నిలిచి ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచారు. ఇక ఆ తర్వాత అభయహస్తం పేరిట ప్రజాపాలన కార్యక్రమన్ని పెద్ద ఎత్తునే చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. ఈ రకంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అన్ని పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అమలులోకి తీసుకొస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల సమయంలో రైతన్నాలకు కూడా ఇచ్చిన హామీలను నెరవర్చేందుకు తెలంగాణ సర్కార్ రైతులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పంట రుణాలపై కీలక నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇది రైతులకు నిజంగా ఓ శుభవార్తనే చెప్పవచ్చు. ఇకపై పంట రుణాలపై ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ బ్యాంకర్లకు కీలక సిఫార్సు చేసింది. అందుకోసం గతంలో కంటే ఎక్కువగా పంట రుణాలు ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలోనే.. వరి పంటకు ఎకరానికి కనిష్ఠంగా రూ.42 వేలు, గరిష్ఠంగా రూ.45 వేల వరకు పంట రుణం ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఇక వరి తర్వాత పత్తి పంట ఎక్కువగా పండిస్తున్నారు. కనుక ఈ తెల్ల బంగారానికి రూ.44-46 వేలు, మొక్కజొన్నకు రూ.32-34 వేలు, మిర్చికి రూ.80 వేలు, పసుపు పంటకు గరిష్ఠంగా రూ.87 వేల వరకు ఇవ్వాలని ఆదేశించింది.

ఇక వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఆధ్వర్యంలో.. రాష్ట్ర ఆర్థిక, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులు గత నెల 13న సచివాలయంలో నాబార్డు, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ, రాష్ట్ర సహకార బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో.. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు, పెరిగిన రవాణా ఖర్చులు, కూలీల ఖర్చులు తదితర అంశాల ప్రాతిపదికంగా ఏ పంటకు ఎంత మేరకు రుణాలివ్వాలనే దానిపై సమావేశంలో చర్చించారు. కాగా, అందరి అభిప్రాయాలను సేకరించిన అనంతరం రాష్ట్రంలో సాగయ్యే వివిధ పంటలతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు 2024-25 రుణ పరిమితిని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే వానాకాలం, యాసంగి సీజన్‌లకు కొత్త రుణ పరిమితులు అమలు చేయాలని నిర్దేశిస్తూ కమిటీ ఛైర్మన్‌ రఘునందన్‌రావు, కన్వీనర్‌ మురళీధర్‌లు తాజాగా అన్ని బ్యాంకులు, డీసీసీబీలు, ప్రాథమిక సహకార సంఘాలకు లేఖను రాశారు.

అలాగే పశుసంవర్ధకం, మత్స్య శాఖలకు కూడా రుణ పరమితి పెంచారు. గతంలో ఒక యూనిట్‌ (20 మేకలు, ఒక పొట్టేలు)కు రూ.21-23 వేల రుణం ఇవ్వడం జరగగా..  దానిని ఇప్పుడు రూ.22-24 వేలకు పెంచారు. ఇక గొర్రెల యూనిట్‌కు రూ.24-26 వేలు, పందుల యూనిట్‌కు రూ.57-59 వేలు రుణంగా ఇవ్వాలని కమిటీ సూచించింది. మరి, తెలంగాణ ప్రభుత్వం రైతులకు  పంట రూణాలు మంజూరు చేయడం పై  మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments