iDreamPost
android-app
ios-app

Rythu Runa Mafi: అర్హులైనా రుణమాఫీ కాలేదా.. శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్

  • Published Aug 13, 2024 | 10:26 AM Updated Updated Aug 13, 2024 | 10:26 AM

Rythu Runa Mafi-Special Drive: తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుంది. అర్హులైన కొందరి రైతులకు రుణమాఫీ వర్తించలేదు. వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

Rythu Runa Mafi-Special Drive: తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుంది. అర్హులైన కొందరి రైతులకు రుణమాఫీ వర్తించలేదు. వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

  • Published Aug 13, 2024 | 10:26 AMUpdated Aug 13, 2024 | 10:26 AM
Rythu Runa Mafi: అర్హులైనా రుణమాఫీ కాలేదా.. శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ ఒకటి. తాము అధికారంలోకి రాగానే ఒకేసారి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. అన్నట్లుగానే అధికారంలోకి రాగానే.. రుణమాఫీ అమలుకు చర్యలు చేపట్టింది. బ్యాంకుల వద్ద నుంచి రైతుల జాబితా తీసుకుని.. మొత్తం రుణాలు ఎన్ని ఉన్నాయి.. ఎంత మొత్తం అవసరం ఉంటుంది అనే దానిపై అంచనా వేశారు. ఆ తర్వాత దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు.

ఇచ్చిన మాట ప్రకారం జులై 18న రైతు రుణమాఫీని ప్రారంభించింది. మెుత్తం మూడు విడతల్లో మాఫీ చేస్తుండగా.. ఇప్పటికే రెండు విడతల్లో రూ. లక్ష, రూ. లక్షన్నర వరకు రుణాలు మాఫీ అయ్యాయి. ఆగస్టు 15న మూడో విడతగా రూ. లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దాంతో రుణమాఫీ ప్రక్రియ ముగుస్తుంది.

Loan waiver but good news for farmers

అయితే ఇప్పటి వరకు రెండు విడతల్లో రుణమాఫీ జరగ్గా.. కొందరు అర్హులైన రైతులకు మాఫీ జరగలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాంక్ అకౌంట్ నెంబర్లలో తప్పులు, ఆధార్ వివరాలు సరిపోలకపోవటం, వివిధ సాంకేతిక కారణాలతో.. అర్హులైన సరే కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తమకు రుణమాఫీ జరగలేదని బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్‌న్యూస్ చెప్పారు.

అర్హతలు ఉన్నా.. రుణమాఫీ కాని రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. అర్హులైన రైతులందరికి రుణమాఫీ అమలు చేస్తామని.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులైన రుణమాఫీ కానీ వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులెవరూ అధైర్యపడొద్దని.. ఆందోళనకు గురికావొద్దని సూచించారు. తమ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని మంత్రి పొన్నం తెలిపారు.

అలానే రుణమాఫీపై బీఆర్ఎస్ చేస్తోన్న ఆరోపణలు పొన్నం ఖండించారు. కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం లక్ష లోపు కూడా రుణమాఫీ సరిగా చేయలేదని.. తాము మాత్రం ఇప్పటికే లక్షన్నర వరకు రుణమాఫీ పూర్తి చేశామని.. తమను విమర్శించే అర్హంత బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని పొన్నం స్పష్టం చేశారు.