iDreamPost
android-app
ios-app

Rythu Runa Mafi: తెలంగాణ రైతులకు అలర్ట్‌.. అర్హతలున్నా రుణమాఫీ కాలేదా.. అయితే ఇలా చేయండి

  • Published Jul 19, 2024 | 3:56 PM Updated Updated Jul 20, 2024 | 8:12 AM

Rythu Runa Mafi-Not Receive Waiver Money Do This: తెలంగాణ ప్రభుత్వం తొలి విడతలో భాగంగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. అయితే మీకు అర్హతలున్నా రుణమాఫీ కాలేదా.. అయితే ఇలా చేయండి.

Rythu Runa Mafi-Not Receive Waiver Money Do This: తెలంగాణ ప్రభుత్వం తొలి విడతలో భాగంగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. అయితే మీకు అర్హతలున్నా రుణమాఫీ కాలేదా.. అయితే ఇలా చేయండి.

  • Published Jul 19, 2024 | 3:56 PMUpdated Jul 20, 2024 | 8:12 AM
Rythu Runa Mafi: తెలంగాణ రైతులకు అలర్ట్‌.. అర్హతలున్నా రుణమాఫీ కాలేదా.. అయితే ఇలా చేయండి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఎన్నికల హామీల అమలుకు కట్టుబడి ఉంది. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. అనడమే కాక.. సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే.. ముందుగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత  ప్రయాణం, ఆరోగ్యశ్రీ పెంపు వంటి హామీలను అమలు చేశారు. ఇక అతి ముఖ్యమైన మరో హామీ అమలుకు రేవంత్‌ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే.. ఒక్కసారే 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. జూలై 18న నుంచి దీన్ని అమలు చేసింది రేవంత్‌ సర్కార్‌.

మూడు విడతల్లో రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్‌ సర్కార్‌ తొలి విడతలో భాగంగా లక్ష రూపాయల రుణమాఫీ అమలు చేసింది. జూన్‌ 18, గురువారం నాడు సాయంత్రం నాటికి లక్ష రూపాయల లోపు లోన్‌ తీసుకున్న రైతుల రుణ ఖాతాలో డబ్బుల జమ చేసింది ప్రభుత్వం. జూలై నెల చివరి నాటికి రెండో విడతలో భాగంగా లక్షన్నర రూపాయలు, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రకటించింది. మొదటి విడతలో భాగంగా లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న సుమారు 11, 50, 000 మంది రైతుల ఖాతాలో 6 వేల 98 కోట్ల రూపాయల నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈనేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ రైతులకు కీలక అలర్ట్‌ జారీ చేసింది. అర్హతలున్నా.. మీకు రుణమాఫీ జరగని వారి కోసం ఓ ప్రకటన చేసింది.

రుణమాఫీ కాలేదా.. ఇలా చేయండి

తెలంగాణ ప్రభుత్వం మొదటివిడతలో భాగంగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వివిధ కారణాల వల్ల.. అర్హతలున్నా సరే.. కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదు. అలాంటి వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రుణమాఫీ పర్యవేక్షణ, ఫిర్యాదు పరిష్కార కమిటీని ఏర్పాటు చేసింది. రుణమాఫీ పథకానికి సంబంధించి రైతుల సందేహాలు, ఇబ్బందులను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి రుణమాఫీ జరగనివారు.. అధికారిక ఐటీ పోర్టల్‌ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు అని సూచించింది. అంతేకాక రుణమాఫీ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణ కోసం క్షేత్రస్థాయిలో కూడా ఓ పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేశారు.

మండల స్థాయిలో ఓ సహాయక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. మండల పరిధిలోని గ్రామాల రైతులు ఇక్కడ ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇలా కంప్లైంట్‌ అందిన 30 రోజుల్లోపు మీ సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కనుక అర్హతలున్నా మీకు రుణమాఫీ కాకపోతే.. మీరు ఏ బ్యాంక్‌లో లోన్‌ తీసుకున్నారో.. అక్కడకు వెళ్లి ఓ సారి సంప్రదించండి. ఏదైనా సాంకేతిక సమస్యల వల్ల రుణమాఫీ కాకపోతే.. ఆ సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది అంటున్నారు.