iDreamPost

Revanth Reddy: బ్యాంకుల్లో బంగారం పెట్టి లోన్‌ తీసుకున్నారా.. రేవంత్‌ సర్కార్‌ సంచలన ప్రకటన

  • Published Jun 29, 2024 | 1:50 PMUpdated Jun 29, 2024 | 1:50 PM

Rythu Runa Mafi: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పాస్‌బుక్‌ ఆధారంగా రుణమాఫీ చేస్తామన్న రేవంత్‌.. బంగారు రుణాల మాఫీపై కూడా స్పందించారు. ఆ వివరాలు..

Rythu Runa Mafi: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పాస్‌బుక్‌ ఆధారంగా రుణమాఫీ చేస్తామన్న రేవంత్‌.. బంగారు రుణాల మాఫీపై కూడా స్పందించారు. ఆ వివరాలు..

  • Published Jun 29, 2024 | 1:50 PMUpdated Jun 29, 2024 | 1:50 PM
Revanth Reddy: బ్యాంకుల్లో బంగారం పెట్టి లోన్‌ తీసుకున్నారా.. రేవంత్‌ సర్కార్‌ సంచలన ప్రకటన

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలుకు ​కృషి చేస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హామీల అమలుకు చర్యలు తీసుకుంటుంది. ఈక్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీ 2 లక్షల రూపాయల పంట రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నాటికి ఈ హామీ అమలు పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ హామీ అమలుకు మార్గదర్శకాలు రెడీ చేశారు. ప్రభుత్వం రుణమాఫీకి అవసరమైన నిధులు సమకూర్చుకునే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో రుణమాఫీకి అర్హతలు నిర్ణయించింది ప్రభుత్వం. రుణమాఫీకి రేషన్‌ కార్డు ప్రామాణికం కాదని.. పాస్‌ బుక్‌ ఆధారంగానే దీన్ని అమలు చేస్తామని చెప్పుకొచ్చింది.

అలానే 2 లక్షల రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని రేవంత్‌ సర్కార్‌ స్పష్టం చేసింది. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని.. రుణమాఫీ తర్వాత రైతు భరోసా, ఇతర పథకాలపై దృష్టి పెడతామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. అయితే రుణమాఫీపై ప్రకటన వెలువడిన నాటి నుంచి బ్యాంకుల్లో బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టత ఇచ్చారు.

రుణమాఫీ ప్రక్రియలో భాగంగా కేవలం పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని.. బంగారంపై తీసుకున్న రుణాల మాఫీ కావని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. దాంతో గోల్డ్‌ లోన్‌ మాఫీ అవుతుందని భావిస్తున్న వారికి ఈ ప్రకటన కాస్త నిరాశ కలిగించింది. మరో వైపు మహిళలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్. తెలంగాణలోని ప్రతి గ్రామంలో మీ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. అయితే ఇక్కడే మహిళలకు బెనిఫిట్ కలుగనుంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటి నిర్వహణ బాధ్యతలను కేటాయించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం వారికి రుణం రూపంలో ఆర్థిక సాయం అందించాలని భావిస్తోంది. ఇందుకు గాను 2.50 లక్షల రుణాన్ని ఇవ్వనుంది. ఈ నిర్ణయం మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి