TG-Rajiv Gandhi Civils Abhaya Hastham Scheme Date Extended: తెలంగాణ సివిల్స్‌ అభ్యర్థులకు మరో ఛాన్స్‌.. రాజీవ్‌ గాంధీ అభయహస్తం స్కీం డేట్‌ పొడగింపు

తెలంగాణ సివిల్స్‌ అభ్యర్థులకు మరో ఛాన్స్‌.. రాజీవ్‌ గాంధీ అభయహస్తం స్కీం డేట్‌ పొడగింపు

Rajiv Gandhi Civils Abhaya Hastham Scheme Date Extended: తెలంగాణ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం ప్రారంభించిన ఓ స్కీమ్‌ ద్వారా రూ.లక్ష పొందేందుకు మరో ఛాన్స్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

Rajiv Gandhi Civils Abhaya Hastham Scheme Date Extended: తెలంగాణ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం ప్రారంభించిన ఓ స్కీమ్‌ ద్వారా రూ.లక్ష పొందేందుకు మరో ఛాన్స్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ప్రజా సంక్షేమం కోసం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. ముందుకు సాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాక.. తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కోసం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో తాజాగా రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారు రూ.లక్ష పొందేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ స్కీమ్‌కు సంబంధించి రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మరో ఛాన్స్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

మన దేశంలో అత్యంత కఠినమైన పరీక్ష అనగానే అందరికి గుర్తుకు వచ్చేది యూపీఎస్‌సీ పరీక్ష. ఈ క్రమంలో రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి సివిల్స్‌ ప్రిలీమ్స్‌ క్వాలిఫై అయిన వారికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌.. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం ప్రారంభించింది. ఈ క్రమంలో దీనికి సంబంధించి తాజాగా రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్‌ దరఖాస్తు గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సింగరేణి కాలరీస్ సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్. బలరామ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పథకానికి అప్లై చేసుకునేందుకు గడువు మంగళవారం, అనగా ఆగస్టు 6తో ముగియగా దాన్ని ఆగస్ట్ 12 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎన్ బలరామ్ తాజా ప్రకటనలో చెప్పుకొచ్చారు.

గత నెల 20 వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు చేతుల మీదుగా ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం ప్రారంభం అయింది. సివిల్స్‌ రాసే వారు ప్రిలిమ్స్ పరీక్ష క్వాలిఫై అయితే.. వారికి రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సింగరేణి కాలరీస్ సంస్థ ముందుకు వచ్చింది. ఇక దీనిలో భాగంగా సివిల్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు.. ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్షను క్లియర్ చేస్తే.. ఈ పథకం కింద లక్ష రూపాయలు పొందేందుకు అర్హులు. కనుక అలాంటి వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే ఈ పథకానికి తెలంగాణ వారు మాత్రమే అర్హులు.

ఈ క్రమంలోనే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం దరఖాస్తుకు చివరి తేదీ ఈనెల 6వ తేదీ. అయితే తాజాగా గడువు పూర్తి కావడంతో.. దాన్ని పొడిగించాలని సింగరేణి కాలరీస్ సంస్థకు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. వాటిని పరిగణలోకి తీసుకున్న సింగరేణి కాలరీస్ సంస్థ.. తాజాగా గడువు పొడగించాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని ఈ నెల 12వ తేదీ వ‌ర‌కు పెంచినట్లు సంస్థ ఛైర్మన్ ఎన్ బలరామ్ స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు సింగరేణి వెబ్‌సైట్ scclmines.com ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

Show comments