iDreamPost
android-app
ios-app

వీడియో: వరదలో చిక్కుకున్న వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు!

  • Published Sep 01, 2024 | 3:54 PM Updated Updated Sep 01, 2024 | 4:04 PM

Telangana Rains- Police bravely rescued a man in nagarkurnool: తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అటు పోలీసులు తమ వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తూ.. హ్యాట్సాఫ్ అనిపించుకుంటున్నారు. తాజాగా వరదల్లో చిక్కుకున్న ప్రజలను సాహసోపేతంగా కాపాడారు పోలీసులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana Rains- Police bravely rescued a man in nagarkurnool: తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అటు పోలీసులు తమ వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తూ.. హ్యాట్సాఫ్ అనిపించుకుంటున్నారు. తాజాగా వరదల్లో చిక్కుకున్న ప్రజలను సాహసోపేతంగా కాపాడారు పోలీసులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 01, 2024 | 3:54 PMUpdated Sep 01, 2024 | 4:04 PM
వీడియో: వరదలో చిక్కుకున్న వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ కు వాయుగుండం ముప్పు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలు జిల్లాలలో రెడ్ , ఆరెంజ్ , ఎల్లో అలర్ట్స్ ను జారీ చేశారు అధికారులు. అత్యవసరం అయితే తప్ప ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. రానున్న 24 గంటలు మరింత అపప్రమత్తంగా ఉండాలని సూచనలు అందించారు. అటు అధికారులను కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు అందిస్తూ.. ప్రజలను అలెర్ట్ చేసేలా చేస్తున్నారు. ఇదిలా ఉంటే పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు తమ వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తూ.. హ్యాట్సాఫ్ అనిపించుకుంటున్నారు. తాజాగా వరదల్లో చిక్కుకున్న ప్రజలను సాహసోపేతంగా కాపాడారు పోలీసులు. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అకాల వర్షాల కారణంగా బస్సు స్టాప్ లు, రైల్వే స్టేషన్ లు అన్ని కూడా మునిగిపోయిన సంగతి తెలిసిందే. రోడ్లన్నీ కూడా జలమయం అయ్యాయి, ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోగా.. ప్రయాణికులు కూడా నానా అవస్థలు పడుతున్నారు. ఇంత జరుగుతున్న..అన్ని ఇబ్బందులను అధిగమించి పోలీసు యంత్రాంగం మాత్రం.. ఎప్పుడు ప్రజల సంరక్షణ కోసమే ఆలోచిస్తూ ఉంటుందని.. మరొక్కసారి ప్రూవ్ చేశారు పోలీసులు. నిన్న రాత్రి వేములవాడ నుంచి మహబూబాబాద్ కు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. వరంగల్ జిల్లా.. వెంకటాపురం శివారులో వరద నీటిలో చిక్కుకుపోయింది. దానికి సంబంధించిన వార్త చూసే ఉంటారు. అలాగే నాగర్ కర్నూల్ లోని నాగనూల్ వాగులో.. వరద నీటి తాకిడికి ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా.. ప్రాణాలకు తెగించి మరి.. పోలీసులు ఆ వ్యక్తిని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆపత్కర సమయాలలో పోలీసులు ఈ విధంగా ప్రజల గురించి ఆలోచిస్తూ.. మంచి మనసు చాటుకుంటున్నారు.

ఇక నిన్నటినుంచి మీడియా , సోషల్ మీడియా లో వర్షాలకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. ఎక్కెక్కడిక్కడ నిలిచిపోయిన వాహనాలు , నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు ఇలా దారుణమైన విజువల్స్ చూశాము. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా.. భయబ్రాంతులకు గురౌతున్నారు. అధికారులు , పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నా సరే.. ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంత.. కొంతమంది ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. అధికారులు వీరికి సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి ప్రజలు కూడా పోలీసులకు సహకరించి.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావడం మంచిది. మరి పోలీసులు ప్రజల పట్ల వహిస్తున్న శ్రద్దపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.