Arjun Suravaram
Barrelakka Arrest: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు బర్రెలక్క అలియాస్ శిరీషా. నిరుద్యోగత విషయంపై వీడియో చేసి.. ఓవర్ నైట్ లో ఆమె ఫేమస్ అయ్యారు. ఇది ఇలా ఉంటే.. తరచూ ఏదో ఒక అంశంతో ఆమె వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా బర్రెలక్కను పోలీసులు అరెస్టు చేశారు.
Barrelakka Arrest: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు బర్రెలక్క అలియాస్ శిరీషా. నిరుద్యోగత విషయంపై వీడియో చేసి.. ఓవర్ నైట్ లో ఆమె ఫేమస్ అయ్యారు. ఇది ఇలా ఉంటే.. తరచూ ఏదో ఒక అంశంతో ఆమె వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా బర్రెలక్కను పోలీసులు అరెస్టు చేశారు.
Arjun Suravaram
బర్రెలక్క.. రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఒక్క వీడియోతో ఎంతో మంది ఫేమస్ అవుతుంటారు. అలా ఓవర్ నైట్ లోనే క్రేజ్ సంపాదించుకున్న వారిలో బర్రెలక్క ఒకరు. నిరుద్యోగం గురించి ప్రస్తావిస్తూ.. ఆమె చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అనంతరం తెలంగాణ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి..రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచింది. ఇది ఇలా ఉంటే.. ఆమె తరచూ ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆమెను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవన్ ముందు ఆమెను పోలీసుసు అరెస్టు చేశారు.
హైదరాబాద్‌లోని టీజీఎస్ పీఎస్సీ భవనం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చిన సంగతి తెలిసింది. నిరుద్యోగ యాత్ర పేరుతో తెలంగణ నిరుద్యోగ జేఏసీ ఇచ్చిన పిలుపుతో..తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. టీజీఎస్ పీఎస్సీ భవనం వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించింది. ఈ క్రమంలో.. ముట్టడికి యత్నించిన యువతను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. టీజీఎస్పీఎస్సీ భవనంకి పెద్ద ఎత్తున యువత చేరుకుని ఆందోళన నిర్వహించగా.. పోలీసులు వాళ్లందరిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. కేవలం హైదరాబాద్ లోని టీజీఎస్ పీఎస్సీ వద్దకు వచ్చిన యువతను కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా పలువురు నిరుద్యోగ జేఏసీ, బీజేవైఎం నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే.. నిరుద్యోగుల ముట్టడికి మద్దతు తెలిపుతూ.. టీజీఎస్పీఎస్సీ ఆఫీస్ కి తన భర్తతో కలిసి వచ్చిన బర్రెలక్క వెళ్లింది. దీంతో ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె అరెస్టుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాను వినియోగించుకుని ఎంతో మంది ఫేమస్ అవుతున్నారు. కొందరు చాలా రోజులకు ఫేమస్ అవ్వగా మరికొందరు మాత్రం చాలా విచిత్రంగా ఓవర్ నైట్ లోనే స్టార్ డమ్ సంపాదిస్తారు. అలాంటి వారిలో బర్రెలక్క.. అలియాస్ శిరీషా ఒకరు. నిరుద్యోగం అంశంపై ఆమె చేసిన ఓ వీడియో సోషల్ మీడియానే షేక్ చేసింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయర్ గా మారిపోయింది ఈ బర్రెలక్క. ఆ తరువాత తెలంగాణ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె గుర్తింపు పొందింది. ఇటీవలే బర్రెలక్క, వెంకటేశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది. అంతేకాక కొన్ని కొన్ని వివాదలతో కూడా బర్రెలక్క వార్తల్లో నిలిచింది.
తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన బర్రెలక్క.. అలియాస్ శిరీషా నిరుద్యోగంపై చేసిన వీడియో అప్పట్లో సంచలనంగా మారింది. అనంతరం ఆమె అనేక కేసును ఎదుర్కొన్నారు. ఆ క్రమంలోనే గతేడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, ఇటీవల జరిగినల లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ రెండు ఎన్నికల్లో ఆమె విజయం సాధించనప్పటికీ మంచి గుర్తింపు పొందారు. ఆమె ఓడిపోయినా కూడా ఎంతో మంది యువతలో స్ఫూర్తిని నింపింది. తానూ ఓడిపోయినా పర్వాలేదు తన పోటీ .. కేవలం యువతను మేల్కొపేందుకు మాత్రమే అంటూ.. అని కూడా ఆ సమయంలో బర్రెలక్క చెప్పుకొచ్చింది. తాజాగా ఏ నిరుద్యోగ వీడియోతో అయితే ఆమె ఫేమస్ అయ్యింది. అలాంటి ఉద్యోగులకు మద్దతుగా టీజీఎస్ పీఎస్సీ భవన్ కి వచ్చే క్రమంలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
TGSPSC వద్ద ఆందోళన చేస్తున్న బర్రెలక్కను అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/QMqD417lO4
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2024