iDreamPost
android-app
ios-app

రుణమాఫీ విడుదల: రైతులు ఈ తప్పులు చేయకండి..పోలీసుల హెచ్చరిక!

Rythu Runa Mafi: గురువారం తెలంగాణ రైతులకు ఓ మంచి శుభవార్త అందింది. ముఖ్యంగా పంటరుణాల మాఫీకి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టుంది. ఈ రోజు రూ. లక్ష లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు.

Rythu Runa Mafi: గురువారం తెలంగాణ రైతులకు ఓ మంచి శుభవార్త అందింది. ముఖ్యంగా పంటరుణాల మాఫీకి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టుంది. ఈ రోజు రూ. లక్ష లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు.

రుణమాఫీ విడుదల: రైతులు ఈ తప్పులు చేయకండి..పోలీసుల హెచ్చరిక!

తెలంగాణ ప్రభుత్వం గురువారం రైతు రుణమాఫీ చేసింది. సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో రైతులతో మాట్లాడి రుణమాఫీ చేశారు. తొలుత రూ.లక్ష లోపు ఉండే రైతుల రుణాలను తెలంగాణ సర్కార్ మాఫీ చేసింది. ఇలానే  ఈ నెల ఆఖరులోపు రూ.1.5 లోపు ఉండే రుణాలను మాఫీ చేయనున్నరు. అదే విధంగా ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంగా నేడు పంటల రుణాల మాఫీకి సంబంధించిన నిధులు విడుదలైన నేపథ్యంలో రైతులకు పోలీసులు వారు కీలక హెచ్చరికలు జారీ చేశారు.ఆ తప్పులు అసలు చేయకండి అంటూ సూచనలు చేస్తున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

గురువారం తెలంగాణ రైతులకు ఓ మంచి శుభవార్త అందింది. ముఖ్యంగా పంటరుణాల మాఫీకి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టుంది. ఈ రోజు రూ. లక్ష లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 11 లక్షల మంది రైతులకు దాదాపు రూ. 6 వేల కోట్ల నిధులు విడుదల చేశారు. నేరుగా రైతుల అకౌంట్లోకి ఈ నిధులు జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు రైతులకు కీలక సూచనలు చేశారు. రైతు రుణమాఫీ నేపథ్యంలో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

కొందరు సైబర్ నేరగాళ్లు ఏదో బ్యాంకు పేరిట వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు, బ్యాంకు లోగోతో వాట్సాప్‌కు ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఫైల్స్ పొరపాటున  యాక్సెప్ట్  చేస్తే..మన వాట్సాప్ సైబర్ దొంగల ఆధీనంలోకి వెళ్లిపోతుందని పోలీసులు అంటున్నారు. అంతేకాక  ఏపీకే ఫైల్స్ ను ఓపెన్ చేయడం వల్ల మన కాంటాక్స్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్తుందని, అలా సైబర్ నేరగాళ్లు చోరీలకు పాల్పడతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మన గూగుల్ పే, ఫోన్‌‍ పే, యూపీఐ అకౌంట్లను హ్యాక్ చేసి నగదును దోచేస్తారని అంటున్నారు.

ట్రెండింగ్‌లో ఉన్న అంశాల ద్వారా ఏపీకే ఫైల్స్ ను అమాయక ప్రజలకు పంపి.. వారి నుంచి డబ్బులు కొట్టేస్తున్నారని తెలిపారు. కాబట్టి రుణమాఫీ నిధులు విడుదలైన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అలెర్ట్ చేశారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చెయ్యకూడదని అంటున్నారు. ఒక వేళ వాట్సాప్ పని చేయకుంటే వెంటనే రీఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంతరం రిపోర్ట్ ఆప్షన్‌లో రిపోర్ట్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు  గురైతే.. వెంటనే 1930 కి కాల్ చేయాలని పోలీసులు చెబుతున్నారు. అంతేకాక www.cybercrime.gov.in లోనూ ఫిర్యాదు చేయవచ్చునని పోలీసులు పేర్కొన్నారు.