P Krishna
Good News For Rtc Workers: గత ఏడాది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దిగ్విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం గా రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు.
Good News For Rtc Workers: గత ఏడాది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దిగ్విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం గా రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు.
P Krishna
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. 2023 లో చివర్లో జరిగిన అసెంబ్లీ అధికార పార్టీ బీఆర్ఎస్ ని ఓడించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్, రైతుకు 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. మహిళలకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తుంది. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఇకపై పీఆర్సీ, కారుణ్య నియామకాలు అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా 500 ఎలక్ట్రిక్ బస్ లను మొదటి విడతగా ప్రారంభించాం. జేబీఎం సంస్థలతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం’ అన్నారు.
అలాగే హైదరాబాద్ లో అన్ని ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలా చూస్తాం. ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించడం ప్రభుత్వం లక్ష్యం. రాష్ట్రంలో ప్రస్తుతం మహాలక్ష్మి పథకం అమల్లో ఉంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి రూ.3200 కోట్ల విలువైన ఉచిత ప్రయాణాలు చేశారు మహిళలు. ఆర్టీసీ బస్ లకు ఇప్పుడు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆర్టీసీ- ప్రభుత్వం కలిపి త్వరలో బస్ ల కొనుగోలు చేస్తాం. ఆర్టీసీలో ఉద్యోగులకు, కార్మికులకు గుడ్ న్యూస్.. తర్వలో పీఆర్సీ, కార్యుణ నియామకాలు అమలు చేస్తాం’ అని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.