iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: మంత్రి పొంగులేటి విమానంలో సాంకేతిక లోపం.. గంటకుపైగా రన్‌వేపైనే..

  • Published May 14, 2024 | 2:06 PM Updated Updated May 14, 2024 | 2:06 PM

Minister Ponguleti Technical Fault in Flight: ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు మరీ ఎక్కువ అయ్యాయి.. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే టెక్నికల్ ఇబ్బందుల వల్ల ఈ సంఘటనలు జరుగుతున్నాయి.

Minister Ponguleti Technical Fault in Flight: ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు మరీ ఎక్కువ అయ్యాయి.. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే టెక్నికల్ ఇబ్బందుల వల్ల ఈ సంఘటనలు జరుగుతున్నాయి.

బ్రేకింగ్: మంత్రి పొంగులేటి విమానంలో సాంకేతిక లోపం.. గంటకుపైగా రన్‌వేపైనే..

ఇటీవల దేశంలో విమాన ప్రమాదాలు మరీ ఎక్కువ అయ్యాయి. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం, ప్రకృతిలో మార్పులు, పక్షులు ఢీ కొని ప్రమాదాలకు గురి అవుతున్నాయి. ప్రమాదాన్ని గమనించి పైలెట్లు వెంటనే విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో ప్రమాదాలు తప్పిపోతున్నాయి. కొన్ని సమయాలో ల్యాండింగ్ చేసే సమయంలో రన్ వేపై కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో మంత్రి, ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడి గంటసేపు రన్ వేపై ఆగిపోయింది. నేతలతో పాటు ఇతర ప్రయాణికులు భయంతో వణికిపోయారు. పూర్తి విరాల్లోకి వెళితే..

తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానానికి సాంకేతిక లోపం తలెత్తడంతో గంట సేపు రన్ వే పై నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి కొచ్చిన వెళ్లాల్సిన ఇండిగో 6ఏ 6707 విమానంలో టేకాఫ్ ముందు ఈ సంఘటన జరిగింది. దీంతో గంటకు పైగా రన్ వేపై విమానం నిలిచి ఉండటంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే విమానంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జరే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, మొవ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య తదితరుల ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఒకే విమానంలో మంత్రి పొంగులేటి, బీఆర్ఎస్ బీఆర్ఎస్ నేత పైలెట్ రోహిత్ రెడ్డి కూడా ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఈ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.