మంత్రి కోమటిరెడ్డి గొప్ప మనస్సు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న జనం!

Komatireddy Venkat Reddy: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలక నేతగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర మంత్రి, రాజకీయ నేతగా ప్రజాసేవలో ఉంటూనే తన కుమారుడి జాపకార్ధం ఆయన అనేక సేవాకార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. తాజాగా ఆయన ఓచిన్నారి విషయంలో గొప్ప మనస్సు చాటుకున్నారు.

Komatireddy Venkat Reddy: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలక నేతగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర మంత్రి, రాజకీయ నేతగా ప్రజాసేవలో ఉంటూనే తన కుమారుడి జాపకార్ధం ఆయన అనేక సేవాకార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. తాజాగా ఆయన ఓచిన్నారి విషయంలో గొప్ప మనస్సు చాటుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర సినిమాటో గ్రాఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన ఎంతో సుపరిచితం. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనదైన ముద్రను వేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలక నేతగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర మంత్రి, రాజకీయ నేతగా ప్రజాసేవలో ఉంటూనే తన కుమారుడి జాపకార్ధం ఆయన అనేక సేవాకార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. తాజాగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తన మంచి మనస్సును చాటుకున్నారు. తల్లిదండ్రులు కోల్పోయిన ఓ బాలికకు ఆయన చేయుత నిచ్చారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేళ్తరోడ గ్రామానికి చెందిన దుర్గ అనే 11 ఏళ్ల బాలిక ఇటీవలే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది.  కొన్ని నెలల క్రితం ఆమె తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఇక తన తల్లితో కలిసి దుర్గ నివాసం ఉంటుంది. అయితే ఇటీవలే ఆమె తల్లి కూడా ఆత్మహత్య చేసుకుని దుర్గను ఒంటరిని చేసింది. ఇలా తల్లిదండ్రులను కోల్పోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో దుర్గ ఉండిపోయింది. బంధువులు, నా అన్నవాళ్లు ఎవరూ రాకపోవటంతో దుర్గ తల్లి మృతదేహం పక్కనే ధీనంగా ఏడుస్తూ ఉండిపోయింది. తన తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆర్థిక స్థోమత లేక అక్కడికి వచ్చిన వారి దగ్గర భిక్షాటన చేసింది. ఆ దృశ్యం అందరినీ కలచివేసింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. అనాథగా మారిన చిన్నారి విషయంలో కోమటిరెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. తన తనయుడి జ్ఞాపకార్ధం నిర్వహిస్తున్న ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి ఆ చిన్నారికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారు.  అంతేకాక  దుర్గ.. తాను ఎంత వరకు చదివితే అంత వరకు చదివిస్తానని, అలానే అన్ని సదుపాయాలు కల్పించి…పెళ్లయ్యే వరకు అండగా ఉంటాన్ని భరోసా ఇచ్చారు. చిన్నారితో  వీడియో కాల్ మాట్లాడిన మంత్రి కోమటి రెడ్డి.. ఆ చిన్నారికి నేనున్నాంటూ ధైర్యాన్ని, భరోసా కల్పించారు.

ఆ చిన్నారి దుర్గ ఎవర్ని డబ్బులు అడగాల్సిన పని లేదని,  అన్ని బాధ్యతలు తానే తీసుకుంటానని తెలిపారు. నిర్మల్ జిల్లా కలెక్టర్‌ను బేళ్తరోడ గ్రామానికి పంపి..ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.  అంతేకాక ఆ చిన్నారి ఇంటికి అవసరమైన అదనపు డబ్బులు కూడా తానే అందిస్తాని తెలిపారు. ఇక మంత్రి కోమటి రెడ్డి మంచి మనసును ఆమె బంధువులు, గ్రామస్తులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పాపను ఆదుకునేందుకు దేవుడిలా ముందుకొచ్చాడని మంత్రిని కొనియాడారు.

Show comments