iDreamPost
android-app
ios-app

Mancherial: దురదృష్టం అంటే ఇతడిదే.. ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య.. కట్‌ చేస్తే నాలుగేళ్ల తర్వాత

  • Published Jun 22, 2024 | 1:06 PM Updated Updated Jun 22, 2024 | 1:06 PM

ఈ యువకుడి పరిస్థితి తెలిస్తే.. అతడిది అదృ‍ష్టం అంటారో.. దురదృష్టం అనాలో అర్థం కాదు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూశాడు. రాలేదు.. ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ నాలుగేళ్ల తర్వాత అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు..

ఈ యువకుడి పరిస్థితి తెలిస్తే.. అతడిది అదృ‍ష్టం అంటారో.. దురదృష్టం అనాలో అర్థం కాదు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూశాడు. రాలేదు.. ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ నాలుగేళ్ల తర్వాత అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు..

  • Published Jun 22, 2024 | 1:06 PMUpdated Jun 22, 2024 | 1:06 PM
Mancherial: దురదృష్టం అంటే ఇతడిదే.. ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య.. కట్‌ చేస్తే నాలుగేళ్ల తర్వాత

జీవితం అంటే ఏంటి.. ఎలాంటి కష్టం రాకుండా.. నిత్యం సంతోషాలు ఉంటాయని భావిస్తున్నారా.. లేదు. కనీసం కథల్లో కూడా ఇలాంటి జీవితాలుండవు. ఈ భూమ్మీదకు వచ్చే సమయంలోనే ఏడుస్తూ వస్తాం.. అది అలా కొనసాగుతుంది. జీవితంలో పెరిగి, పెద్దవుతున్న క్రమంలో కష్టాలు, ఇబ్బందులు మాత్రమే కాక ఆనందం, సంతోషం ఇలా అన్ని భావోద్వేగాలుంటాయి. అయితే కష్టం వచ్చిన సమయంలో బాధపడటం.. సంతోషాలు వచ్చినప్పుడు పొంగి పోవడం వంటివి చేయకూడదు. అన్నింటిని సమానంగా తీసుకోవాలి. జీవితం మీద ఈ మాత్రం స్పష్టత ఉంటే.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా తట్టుకోగలం.. రాణించగలం. లేదంటే చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసకుంటారు. ఆఖరికి పరీక్షల్లో ఫెయిల్‌ అయినా సరే ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుకుంటున్నారు. ఇక తాజాగా ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది.

ఆ యువకుడు ప్రవేశ పరీక్షల కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి చదువుతున్నాడు. అర్హత ఉన్న ప్రతి పరీక్షకు అ‍ప్లై చేశాడు. కానీ వరుసగా ఓటములు ఎదురవుతుండటంతో.. కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో.. ప్రాణాలు తీసుకున్నాడు. కానీ అతడి దురదృష్టం ఎలా ఉందో చూడండి.. గవర్నమెంట్‌ జాబ్‌ రాలేదని నాలుగేళ్ల క్రితం చనిపోయిన ఆ యువకుడికి.. ఇప్పుడు తాజాగా కాల్‌ లెటర్‌ వచ్చింది. ఆ విషయం తెలిసి సదరు యువకుడి కుటుంబ సభ్యులు ఎంతగానో బాధపడుతున్నారు. ఈ విషాదకర సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది అంటే..

ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఓ యువకుడికి.. అతడు చనిపోయిన నాలుగేళ్ల తర్వాత జాబ్‌కు కాల్‌ లేటర్‌ రావడం ఆసక్తికరంగా మారింది. ఈ సంఘటన తెలంగాణలోని, మంచిర్యాల జిల్లాలో, శుక్రవారం నాడు వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మొండయ్య-సరోజ దంపతులకు నలుగురు పిల్లలు కాగా.. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. నవీన్‌కుమార్, అనూష, ఆదిత్య, జీవన్‌కుమార్‌‌లు. వీరిలో జీవన్‌కుమార్‌ 2014లో ఐటీఐ పూర్తి చేశాడు. ఈ క్రమంలో విద్యుత్ శాఖలోని ఉద్యోగాల భర్తీకి 2018లో నోటిఫికేషన్ విడుదలైంది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెట్ (ఎన్‌పీడీసీఎల్‌)లో జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ క్రమంలో జీవన్‌ కుమార్‌ జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసి, రాతపరీక్షకు హాజరయ్యాడు. ఉద్యోగం రాలేదని మనస్తానికి గురైన జీవన్.. 2020 మార్చి 15న ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకు ముందే అతడి అన్న ఆదిత్య అనారోగ్యంతో 2018లో, తల్లి సరోజ జనవరి, 2019లో మరణించారు. జీవన్ ఆత్మహత్య చేసుకున్న ఏడాదికే అక్క అనూష, తండ్రి మొండయ్య చనిపోయారు. ప్రస్తుతం ఆ కుటుంబంలో జీవన్ అన్నయ్య నవీన్‌ ఒక్కరే ప్రాణాలతో ఉన్నాడు. ఇలా ఉండగా తాజాగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. జీవన్‌ చనిపోయిన 4 ఏళ్ల తర్వాత అతడికి కాల్‌ లేటర్‌ పంపంది.

లైన్‌మెన్‌ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన అధికారులు.. ముందుగా ఎక్కువ మార్కులు వచ్చిన వారితో పోస్టులను భర్తీ చేశారు. ఆ తర్వాత అర్హులైన వారు లేకపోవడంతో.. కొన్ని పోస్టులను నింపకుండా అలానే ఉంచారు. అయితే ఈ మిగులు పోస్టుల భర్తీ విషయంలో కొంతమంది అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో విద్యుత్‌ శాఖ.. ఈ ఖాళీల భర్తీకి మెరిట్‌ ప్రకారం అధికారులు శ్రీకారం చుట్టారు.

ఈ నేపథ్యంలో జీవన్‌కుమార్‌ను ఆఖరి పరీక్షల అనగా.. విద్యుత్తు స్తంభం ఎక్కే పరీక్షకు హాజరు కావాలని కాల్ లెటర్ పంపారు. ఈ నెల 24న అతడికి షెడ్యూల్ ఉన్నట్టు కాల్‌లెటర్‌ వచ్చింది. కానీ జీవన్ కుమార్ 2020లోనే ఆత్మహత్యకు పాల్పడటంతో పోస్ట్‌మ్యాన్‌ దానిని తిరిగి వెనక్కి పంపించారు. ఏ ఉద్యోగం కోసం అయితే తన తమ్ముడు జీవన్‌ ఆత్మహత్య చేసుకున్నాడో.. ఇప్పుడు అదే జాబ్‌కు కాల్‌ లెటర్‌ రావడంతో.. నవీన్‌ కన్నీరుమున్నీరు అవుతున్నాడు.