iDreamPost
android-app
ios-app

తెలంగాణ ప్రజలకు బిగ్‌ అలెర్ట్‌! రానున్న 24 గంటలు చాలా డేంజర్‌!

  • Published Sep 01, 2024 | 10:47 AM Updated Updated Sep 01, 2024 | 10:47 AM

Telangana Rains: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండం కారణంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలో రెడ్ అలర్ట్ ను జారీ చేశారు అధికారులు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణకు వాయుగుండం ముప్పు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana Rains: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండం కారణంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలో రెడ్ అలర్ట్ ను జారీ చేశారు అధికారులు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణకు వాయుగుండం ముప్పు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 01, 2024 | 10:47 AMUpdated Sep 01, 2024 | 10:47 AM
తెలంగాణ ప్రజలకు బిగ్‌ అలెర్ట్‌! రానున్న 24 గంటలు చాలా డేంజర్‌!

రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలంతా బయటకు రావొద్దంటూ ఇప్పటికే పలు సూచనలు జారీ చేసారు అధికారులు. ఇక నిన్న రాత్రి నుంచి ఉత్తర బంగాళ ఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా.,. తెలంగాణాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ను జారీ చేసారు అధికారులు. ప్రజలంతా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని సమాచారం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 12 గంటల నుంచి తెలంగాణాలో కుండపోత వర్షం కురుస్తుంది. హైదరాబాద్ నగరంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక రానున్న 24 గంటల్లో తెలంగాణ మీదుగా వాయుగుండం కదలనున్నట్లు సమాచారం. దీనితో పలు జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలంతా మరింత అపప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు అంటే సెప్టెంబర్ 1న తెలంగాణాలోని.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక ఈ జిల్లాలతో పాటు.. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక తెలంగాణలోని సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, మెదక్‌ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. రానున్న రెండు రోజులు ప్రజలంతా మరింత అపప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అధికారులకు కూడా పలు సూచనలు జారీ చేశారు. కాబట్టి ప్రజలంతా అత్యవరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం మంచిది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.