Arjun Suravaram
గురువారం తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం కానున్నాయి. మరి.. పరీక్షల షెడ్యూల్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గురువారం తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం కానున్నాయి. మరి.. పరీక్షల షెడ్యూల్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Arjun Suravaram
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణంతో పాటు పరీక్షల వాతావరణం ప్రారంభమైంది. వివిధ బోర్డులు, మార్చి ఏప్రిల్ లో జరగాల్సిన పరీక్షల షెడ్యూల్స్ ను విడుదల చేస్తున్నాయి. ఇటీవలే ఏపీ ఇంటర్ పరీక్ష షెడ్యూల్స్ విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణలో కూడా ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయని తెలంగాణ ఇంటర్నీడియట్ బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్ ద్వితియ ఏడాది విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించున్నట్లు బోర్డు తెలిపింది. మరి.. ఇంటర్ పరీక్ష షెడ్యూల్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వచ్చే ఏడాదిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను గత ఏడాదితో పోలిస్తే త్వరగా నిర్వహించనుంది. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు మార్చి నెలలోనే పూర్తి కానున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల తేదీపై నిర్ణయానికి తీసుకుంది. గురువారం విద్యా శాఖ అధికారులు అధికారికంగా విడుదల చేశారు. జనవరిలో ప్రీ ఫైనల్, ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల్నించి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరుగుతాయి.