గత కొంతకాలంగా కుల, మత ప్రస్తావన గురించి దేశంలోని పలు హైకోర్టులు సంచలన తీర్పులు వెల్లడించిన విషయం తెలిసిందే. మతం మారినా కులం మారదని గతంలోనే మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. మద్రాస్ హైకోర్టుతో పాటుగా దేశంలోని మరికొన్ని కోర్టులు కుల, మత విషయంలో పలు సంచలన తీర్పులు వెలువరించాయి. తాజాగా తెలంగాణ హైకోర్టు సైతం బర్త్ సర్టిఫికెట్ లో కుల, మత ప్రస్తావనపై సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
బర్త్ సర్టిఫికెట్ విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. కులం, మతం వద్దనుకునే హక్కు పౌరులకు ఉంటుందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత తీర్పును వెలువరించారు. ఇక కుల, మత ప్రస్తావన లేకుండా బర్త్ సర్టిఫికెట్ ల దరఖాస్తులను స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని కోర్టు తీర్పును ఇచ్చింది. ఇందుకు సంబంధించి కులరహితం, మతరహితం అనే ప్రత్యేక కాలమ్ లను ప్రవేశపెట్టాలని పురపాలక, విద్యా శాఖ, మున్సిపల్ కమిషనర్లకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ సంచలన తీర్పును సందెపాగు రూప, డేవిడ్ దంపతుల పిటీషన్ సందర్భంగా విచారించి.. తుది తీర్పును వెలువరించింది. మరి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: మణిపూర్ లో స్త్రీలను నగ్నంగా ఉరేగించడంపై ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్!