iDreamPost
android-app
ios-app

అలర్ట్.. ఇవాళే ‘ప్రజా పాలన’ దరఖాస్తులకు లాస్ట్ డేట్!

Praja Palana Applications Last Date: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన హామీ ఇచ్చిది. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుకు కసరత్తు మొదలు పెట్టింది.

Praja Palana Applications Last Date: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన హామీ ఇచ్చిది. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుకు కసరత్తు మొదలు పెట్టింది.

అలర్ట్.. ఇవాళే ‘ప్రజా పాలన’ దరఖాస్తులకు లాస్ట్ డేట్!

తెలంగాణలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇటీవల ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరగ్యశ్రీ పథకాలు ప్రారంభించింది. ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి ధరఖాస్తుల స్వీకరణకు ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమం మారుమూల గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 06, 2024 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించి. వార్డులు, గ్రామ సభల ద్వారా ప్రజా పాలన దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ‘ప్రజా పాలన’ దరఖాస్తు స్వీకరణకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా కోటి అప్లికేషన్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజా పాలన కార్యక్రమం మొదటి రోజే తెలంగాణ వ్యాప్తంగా 7 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఏదైనా కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేని వారికి.. మరో మూడు నెలల తర్వాత మరో అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రజా పాలన కార్యక్రమం మొదలైనప్పటి నుంచి భారీ స్పందన వస్తుంది. అయితే డిసెంబర్, నూతన సంవత్సరం కారణంగా రెండు రోజులు విరామం ఇచ్చారు. నేటితో దరఖాస్తు స్వీకరణ తేదీ దగ్గర పడింది. ఇప్పటి వరకు దాదాపు కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయని.. ఈ రోజు చివరి రోజు కావడంతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. లాస్ట్ డేట్ కావడం వల్ల దరఖాస్తులు చేసుకోని వారు త్వరపడాలని అధికారులు సూచిస్తున్నారు.

today last date for prajapalana

ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ప్రజా పాలన కార్యక్రమం శనివారం చివరి రోజు కావడంతో భారీగా ధరఖాస్తులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసేందుకు క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు. అంతేకాదు రద్దీని బట్టి ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా కారణాల వల్ల ఈ రోజు దరఖాస్తు చేసుకోలేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతానికి దరఖాస్తుల స్వీకరణ తేదీ పొడిగించలేమని.. కాకపోతే ప్రజా పాలన కార్యక్రమం నాలుగు నెలలకు ఒకసారి ఉండబోతుందని సీఎం శాంతి కుమారి తెలిపారు. ప్రతి నాలుగు నెలలకు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక ప్రజా పరిపాలన సమావేశాలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తామని ఆమె అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని భరోసా ఇచ్చారు సీఎస్ శాంత కుమారి. ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేయని వారు ఈ రోజు త్వరపడితే మంచిది.. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి