Swipe Cards: ఏటీఎం కార్డులా రేషన్ కార్డులు! ఇక స్వైప్ చేసి సరుకులు తీసుకోవడమే!

Swipe Cards: ఏటీఎం కార్డులా రేషన్ కార్డులు! ఇక స్వైప్ చేసి సరుకులు తీసుకోవడమే!

TG Govt Key Decision On Ration Cards: రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పాత రేషన్ కార్డు విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విధానం అమలులోకి వస్తే ఎంతో మేలు జరుగుతుంది.

TG Govt Key Decision On Ration Cards: రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పాత రేషన్ కార్డు విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విధానం అమలులోకి వస్తే ఎంతో మేలు జరుగుతుంది.

ఏటీఎం కార్డులు రాక ముందు బ్యాంకుల్లో డబ్బు తీసుకోవడానికి జనాలు క్యూలైన్లలో గంటలు గంటలు నిలబడేవారు. దీంతో చాలా మందికి విసుగు వచ్చేది.. సమయం కూడా వృధా అయ్యేది. అయితే ఏటీఎం మెషిన్లు, ఏటీఎం కార్డులు అందుబాటులోకి వచ్చాక డబ్బులు తీసుకునే పని సులువైపోయింది. ఆ తర్వాత నెట్ బ్యాంకింగ్ రావడం.. ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ రావడంతో ఏటీఎంలకి వెళ్లేవారి సంఖ్య తగ్గిపోయింది. ఇలా సాంకేతికంగా పలు రంగాలు అప్డేట్ అవుతున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వ పథకాల విషయంలో ఎందుకు అప్డేట్ అవ్వకూడదు అని అనుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు రేషన్ కార్డుల విషయంలోనూ సాంకేతికతను వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పాత రేషన్ కార్డులకు బదులు కొత్తగా డిజిటల్ రేషన్ కార్డులను తీసుకురావాలని రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు ఎంత సులువుగా తీసుకుంటారో.. అంతే సులువుగా కొత్త రేషన్ కార్డుల ద్వారా సరుకులు తీసుకునేలా ప్రభుత్వం భావిస్తుంది. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ వంటి వాటిలో ఏటీఎం కార్డుని ఎలా అయితే స్వైప్ చేస్తామో.. అలా ఈ కొత్త రేషన్ కార్డులను స్వైపింగ్ చేసి సరుకులు తీసుకునే విధంగా రేవంత్ సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక గుర్తింపు కార్డు సైజులో ఈ స్వైపింగ్ రేషన్ కార్డులను తయారు చేసి.. వాటిలో ఒక చిప్ ని పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. చిప్ లో రేషన్ కార్డు నంబర్, కార్డు లబ్ధిదారుల వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ ఉంటాయి. రేషన్ కార్డుని స్వైప్ చేయగానే లబ్ధిదారుల వివరాలు అన్నీ మానిటర్ లో డిస్ప్లే అవుతాయి. రేషన్ విషయంలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు, నకిలీ రేషన్ కార్డులను ఏరివేయడానికి ఈ స్వైపింగ్ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పాత రేషన్ కార్డు విధానానికి స్వస్తి చెప్పి కొత్త రేషన్ కార్డు విధానాలను అమలు చేస్తున్నారు. హర్యానాలో డిజిటల్ రేషన్ కార్డ్స్ విధానం, ఉత్తరప్రదేశ్ లో బార్ కోడ్ రేషన్ కార్డుల విధానం అమలులోకి వచ్చాయి. ఒడిశా ప్రభుత్వం అయితే ఏటీఎం తరహాలో రేషన్ కార్డులను తీసుకొచ్చే యోచనలో ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో కూడా కొత్త రేషన్ కార్డు విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రేషన్ కార్డుల్లో చిప్ లు, స్వైపింగ్ ప్రక్రియకు కావాల్సిన సాంకేతికతను డెవలప్ చేసేందుకు సాఫ్ట్ వేర్ నిపుణులతో ప్రభుత్వం చర్చించి వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే ఇక రేషన్ దుకాణాల విషయంలో జరిగే మోసాలకు చెక్ పెట్టినట్లు అవ్వడమే కాకుండా ప్రజల పని మరింత సులువు కానుంది.

Show comments