iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రూ.300కే ఇంటర్నెట్, టీవీ

  • Published Aug 23, 2024 | 9:45 PM Updated Updated Aug 23, 2024 | 9:45 PM

Revanth Reddy Plans To Give Internet, TV Connection For Rs.300 To Telangana People: నెలకు 300 రూపాయలకే టీవీ కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్ అందించాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రితో చర్చించారు.

Revanth Reddy Plans To Give Internet, TV Connection For Rs.300 To Telangana People: నెలకు 300 రూపాయలకే టీవీ కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్ అందించాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రితో చర్చించారు.

గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రూ.300కే ఇంటర్నెట్, టీవీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల నిర్వహణకు కావాల్సిన మౌలిక వసతులు హైదరాబాద్ లో ఉన్నాయని.. కామన్ వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ కి ఆతిథ్యాన్ని హైదరాబాద్ కి ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గతంలో హైదరాబాద్ లో పలు జాతీయ క్రీడా పోటీలను నిర్వహించామని కూడా తెలిపారు.

హైదరాబాద్ లో ఉన్న మౌలిక వసతులను గుర్తించాలని.. 2025 జనవరిలో నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కి ఆతిథ్యం కల్పించే అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. అలానే తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకి నిర్ణయం తీసుకున్నామని.. దానికి కావాల్సిన ఆర్థిక సహకారాలు అందించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఖేలో ఇండియా స్కీం కింద అందించే మొత్తాన్ని కూడా పెంచాలని కోరారు. ఇక ఎల్బీ స్టేడియం, జీఎంసీ బాలయోగి స్టేడియం, షూటింగ్ రేంజ్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూళ్లను అప్గ్రేడ్ చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్ లను ఆమోదించాలని రేవంత్ రెడ్డి కోరారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న టీ-ఫైబర్ ప్రాజెక్టుని భారత్ నెట్ ఫేజ్ 3లో చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. గ్రామాలకు, మండలాలకు నెట్వర్క్ అందించడమే టీ-ఫైబర్ ప్రాజెక్ట్ లక్ష్యమని.. 65 వేల ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించాలన్న లక్ష్యం పెట్టుకున్నామని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని.. టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుకు ఎన్ఎఫ్ఓఎన్ సహకారం అవసరమని కేంద్ర మంత్రిని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం 1779 కోట్ల రూపాయల వడ్డీ లేకుండా రుణం ఇవ్వాలని సీఎం కోరారు. నెలకు 300 రూపాయలకే ఇంటర్నెట్, టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందిస్తామని అన్నారు.