nagidream
Intinta Innovator: టాలెంట్ కి చదువుతో సంబంధం లేదు. ఎవరైనా నిరూపించుకోవచ్చు. అయితే అలా నిరూపించుకునే అవకాశం రావాలి. అయితే తెలంగాణ ప్రభుత్వం టాలెంట్ ని ప్రూఫ్ చేసుకోవాలనుకునేవారికి గొప్ప అవకాశాన్ని ఇస్తుంది.
Intinta Innovator: టాలెంట్ కి చదువుతో సంబంధం లేదు. ఎవరైనా నిరూపించుకోవచ్చు. అయితే అలా నిరూపించుకునే అవకాశం రావాలి. అయితే తెలంగాణ ప్రభుత్వం టాలెంట్ ని ప్రూఫ్ చేసుకోవాలనుకునేవారికి గొప్ప అవకాశాన్ని ఇస్తుంది.
nagidream
మీలో టాలెంట్ ఉందా? మీలో క్రియేటివిటీ ఉందా? ఏదైనా ఒక సమస్యకు పరిష్కారం చూపించేలా ఒక కొత్త ఆవిష్కరణను కనిపెట్టగలరా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన అవకాశం. ఏదైనా ఒక సమస్యకు మీ దగ్గర ఇన్నోవేటివ్ ఐడియా ఉంటే తెలంగాణ ప్రభుత్వం మీ కోసం గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. చదువుకున్నవారికి, చదువుకోనివారికి టాలెంట్ అనేది ఉంటుంది. చదువుతో సంబంధం లేకుండా వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాదికి గాను ఆరో విడత ప్రోగ్రాంలో పాల్గొనేందుకు దరఖాస్తులను కోరుతుంది. వివిధ రంగాల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించడమే ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యావేత్తలు, మహిళలు ఇలా ఎవరైనా కొత్త కొత్త ఆవిష్కరణలు చేయవచ్చు. ఆలోచనలకు క్రియేటివిటీని జోడించి ప్రయోగ వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలి. ఉత్తమ ఆవిష్కరణలను ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ అండ్ కమ్యూనికేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆవిష్కరణలను గుర్తించేందుకు ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. వివిధ వర్గాల ప్రజల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడంలో ఈ ప్రోగ్రామ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
గతంలో నిర్వహించిన కార్యక్రమం కన్నా ఈసారి నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన వారికి ఆగస్టు 15న ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలకు చెందిన 3 వేలకు పైగా గ్రామ పంచాయితీల నుంచి ఆవిష్కర్తలు పాల్గొనే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. జిల్లాకు ఒకరు చొప్పున మొత్తం 33 మంది సభ్యులతో కూడిన ‘ఇన్నోవేషన్ మిత్ర’ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలోని సభ్యులు కోఆర్డినేటర్లుగా సేవలను అందిస్తారు. గ్రామాల్లోని ప్రజలను అనుసంధానం చేస్తూ.. జిల్లా అధికారులు, పౌర సమాజ సంస్థలు, ఎన్జీఓలు కీలక పాత్ర పోషిస్తారు. ఇంటింటా ఇన్నోవేటర్ 2024 ప్రోగ్రాంలో పాల్గొనాలనుకునేవారు ఆగస్టు 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని.. వారి వివరాలను 9100678543 వాట్సాప్ నంబర్ కి పంపించాలని పేర్కొంది.