iDreamPost
android-app
ios-app

తెలంగాణలో వారికి భారీ శుభవార్త.. ఇకపై నెలకు రూ.25 వేల పెన్షన్‌

  • Published Jul 23, 2024 | 8:26 AM Updated Updated Jul 23, 2024 | 8:26 AM

Telangana Govt-Rs 25000 Pension, Padma Shri Award Winners: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారికి నెలకు 25 వేల రూపాయల పెన్షన్‌ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

Telangana Govt-Rs 25000 Pension, Padma Shri Award Winners: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారికి నెలకు 25 వేల రూపాయల పెన్షన్‌ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

  • Published Jul 23, 2024 | 8:26 AMUpdated Jul 23, 2024 | 8:26 AM
తెలంగాణలో వారికి భారీ శుభవార్త.. ఇకపై నెలకు రూ.25 వేల పెన్షన్‌

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తుంది. ఐదు రోజుల క్రితం రైతు రుణమాఫీని అమలు చేసిన సంగతి తెలిసిందే. మూడు విడతల్లో రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్‌ సర్కారు తెలపడమే కాక.. తొలి విడతలో భాగంగా ముందుగా లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేసింది. జూలై చివరి నాటికి రెండో విడతలో భాగంగా లక్షన్నర రూపాయలు.. ఆగస్టు 15లోపు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. అంతేకాక ఆరు గ్యారెంటీలు మాత్రమే కాక.. ప్రజా సంక్షేమానికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం గుడ్‌న్యూస్‌ చెప్పారు. తెలంగాణలో ఇకపై వారికి నెలకు 25 వేల రూపాయల పెన్షన్‌ ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. ఆ వివరాలు..

తెలంగాణలోని ప‌ద్మశ్రీ గ్రహీత‌ల‌కు భారీ ఎత్తున పింఛన్ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ ముందుకు వచ్చింది. వారికి ఇకపై నెల నెలా రూ. 25 వేల చొప్పున పింఛన్ ఇచ్చేందుకు అంగీకరిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు సోమవారం (జూలై 22) అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలను గతంలో హైదరాబాద్‌లోని శిల్పరామంలో ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే పద్మశ్రీ గ్రహీతలందరికీ ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున నజరానా అందించారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ఇకపై వారికి ప్రతి నెలా 25,000 రూపాయలు పింఛను ఇచ్చేందుకు అంగీకరించిన సర్కార్‌.. అందుకు సంబంధించి తాజాగా జీవో విడుదల చేశారు.

25k Pension for Padmasri Awards

పద్మశ్రీ గ్రహీతలకు ఇక నుంచి ప్రతి నెల రూ. 25 వేలు గౌరవ పెన్షన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కనుమరుగవుతున్న కళలను గుర్తించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించే క‌ళాకారుల‌ను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి రేంవ‌త్ రెడ్డి సార‌థ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంద‌ని చెప్పుకొచ్చారు. అంతేకాక ఇటీవ‌లే ప‌ద్మశ్రీ పుర‌స్కారాన్ని అందుకున్న గ‌డ్డం స‌మ్మయ్య, దాస‌రి కొండ‌ప్ప తదితరులకు ప్రతి నెల 25 వేల రూపాయల ప్రత్యేక‌ పింఛ‌న్ మంజూరు చేస్తూ జీవో జారీ చేసినట్లు మంత్రి జూపల్లి తెలిపారు. ఇక నుంచి సాంస్కృతిక శాఖ ద్వారా ఈ పింఛ‌న్ డ‌బ్బులు నేరుగా వారి ఖాతాల్లో జ‌మ అవుతాయని చెప్పుకొచ్చారు

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పద్మ అవార్డులను ప్రకటిస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ఏడాది ఐదుగురికి పద్మశ్రీ దక్కింది. వారు దాసరి కొండప్ప (కళలు), ఏ వేలు ఆనందచారి (కళలు), జీ సమ్మయ్య (కళలు), కూరెళ్ల విఠలాచార్య, (విద్య, సాహిత్యం), కేతావత్ సోమ్‌లాల్ (విద్య, సాహిత్యం) పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. ఇక తాజాగా వారికి 25 వేల రూపాయల పెన్షన్‌ అందించారు. అయితే పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఇలా ప్రత్యేకంగా పెన్షన్‌ ఇవ్వడం మన దగ్గర ఇదే తొలిసారి కానీ.. ఇప్పటికే హరియాణాలో ఇది అమల్లో ఉంది. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు హర్యాణా ప్రభుత్వం ఇప్పటికే పింఛన్ అందిస్తోంది. కిందటేడాది నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వారికి ప్రతి నెలా రూ. 10 వేల చొప్పున పింఛన్ అందిస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంద.ఇ