iDreamPost
android-app
ios-app

Holiday: ఉద్యోగులకు శుభవార్త.. ఆ 3 రోజులు సెలవు.. ఇది మాత్రం మర్చిపోకండి!

  • Published May 07, 2024 | 8:11 AM Updated Updated May 08, 2024 | 6:50 PM

ఉద్యోగులకు భారీ శుభవార్త. ఆ రెండు రోజులు సెలవుగా ప్రకటిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో రోజు సెలవు రావడంతో ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి.

ఉద్యోగులకు భారీ శుభవార్త. ఆ రెండు రోజులు సెలవుగా ప్రకటిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో రోజు సెలవు రావడంతో ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి.

  • Published May 07, 2024 | 8:11 AMUpdated May 08, 2024 | 6:50 PM
Holiday: ఉద్యోగులకు శుభవార్త.. ఆ 3 రోజులు సెలవు.. ఇది మాత్రం మర్చిపోకండి!

సెలవులు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. విద్యార్థులు మొదలు ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరు సెలవుల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పది, ఇంటర్‌, స్కూల్‌ విద్యార్థులకు సెలవులు ఇచ్చేశారు. వారంతా ప్రస్తుతం హాలీడేస్‌ ఎంజాయ్‌ చేసే పనిలో ఉన్నారు. ఇక ఉద్యోగులు సెలవుల కోసం ఎదురు చూడటం.. చాలా కామన్‌. అయితే పండుగలు, ఏవైనా జాతీయ సెలవు దినాల వేళ మాత్రమే ఉద్యోగులకు సెలవులు ఇస్తారు. లేదంటే వారానికి ఒకసారి వీకాఫ్‌ మాత్రమే ఉంటుంది. ఏవైనా అక్కర్లు ఉంటే.. సెలవులు పెట్టుకోవాలి. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు ఉద్యోగులకు పెయిడ్‌ హాలీడేగా ప్రకటించింది. ఆ వివరాలు..

తెలంగాణ ప్రభుత్వం మే 13 అనగా సోమవారం, జూన్‌ 4న రెండు రోజులను వేతనంతో కూడిన సెలవు దినాలుగా ప్రకటించింది. ఈమేరకు తెలంగాణ సీఎస్‌ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈ రెండు రోజులు సెలవులు ఎందుకు ఇచ్చారంటే.. మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ జరగనుంది. తెలంగాణలో పార్లమెంట్‌.. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ క్రమంలో మే 13, సోమవారం నాడు సెలవుగా ప్రకటించారు. ఇక జూన్‌ 4.. కౌంటింగ్‌ కనుక ఆ రోజున కూడా సెలవుగా ప్రకటించారు.

ఇక ఏపీకి సంబంధించి ఆదేశాలు జారీ కావాల్సి ఉంది. ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. మే 11, 12న రెండో శనివారం, ఆదివారం కావడంతో రెండు రోజులు సెలవులు ఉన్నాయి. అలానే మే 13 న కూడా సెలవుగా ప్రకటించడంతో.. వరుసగా మూడు రోజుల పాటు హాలీడేస్‌ కలిసి వస్తున్నాయి. మరి మూడు రోజుల పాటు సెలవులు ఉండనున్న నేపథ్యంలో ఉద్యోగులు  ఓటు వేయడం బాధ్యతగా తీసుకుని అందరు పోలింగ్ లో పాల్గొనాలని సూచిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు దేశవ్యాప్తంగా 3వ విడత ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. ఈ దశలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరుగుతుంది. వాస్తవానికి మూడవ దరశలో భాగంగా నేడు అనగా మంగళవారం నాడు.. 94 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉన్నా.. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ నియోజకవర్గంలో ఓటింగ్ మే 25కు వాయిదా పడింది. ఇక మూడో దశలో మొత్తం 1,300 మందికిపైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ, పురుషోత్తమ్‌ రూపాలా, ప్రహ్లాద్‌ జోషి, ఎస్‌.పి.సింగ్‌ బఘేల్‌, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. బారమతిలో అజిత్ పవార్ భార్య సునేత్రా, సుప్రియా మధ్య కుటుంబపోరు ఆసక్తికరంగా మారింది. వరుసగా సెలవులు కలిసి వస్తుండటంతో.. చాలా మంది ఊర్లకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.