Dharani
ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏ అంట్లో కూడా వాటిని అమ్మకూడదు అని నిర్ణయం తీసుకుంది. ఇంతకు వేటి అమ్మకాలను బ్యాన్ చేసింది అంటే..
ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏ అంట్లో కూడా వాటిని అమ్మకూడదు అని నిర్ణయం తీసుకుంది. ఇంతకు వేటి అమ్మకాలను బ్యాన్ చేసింది అంటే..
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. పాలనలో తనదైన దూకుడు చూపిస్తోంది. సరికొత్త, సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తొలి నాళ్లలోనే.. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మత్తు పదార్థాల వినియోగం, అమ్మకాల నిషేధంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. డ్రగ్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మాదక ద్రవ్యాల కేసుల్లో.. ఎంత పెద్ద వాళ్లు ఉన్నా సెలబ్రిటీలు ఉన్నా సహించేది లేదని.. కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. దాంతో పాటు రాష్ట్రంలో ఆహార కల్తీని నివారించడంపైన కూడా దృష్టి సారించారు సీఎం రేవంత్. ఇక హైదరాబాద్ నగరంలో గత వారం రోజులుగా ఫుడ్ సెఫ్టీ అధికారులు వరస దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని కంకణం కట్టుకున్న రేవంత్ సర్కార్.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గుట్కా తయారీ, అమ్మకాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం.. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్రంలో గుట్కా తయారీ, అమ్మకాలపై నిషేధం విధిస్తుట్లు ప్రకటించారు. ఈ నిషేధం 2024, మే 24 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఇది రాష్ట్రం మొత్తం వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గుట్కా తయారీ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ఫుడ్ సెఫ్టీ అధికారులు వెల్లడించారు. పొగాకు, నికోటిన్, పౌచ్‌లు, ప్యాకేజీ, కంటెయినర్లు మొదటైన వాటిలో ప్యాక్ చేసిన గుట్కా, పాన్ మసలా తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలను నిషేధించినట్లు ఈ ఉత్తర్వుల్లో వెల్లడించారు. దీనిపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆడా, మగా తేడా లేకుండా.. చాలా మంది గుట్కాను వినియోగిస్తున్నారు.
దీని వల్ల నోటి క్యాన్సర్ బారిన పడతారని తెలిసి కూడా జనాలు ఈ అలవాటుకు బానిసలు అవుతున్నారు. బడ్డీ కొట్లు, కిరాణ దుకాణాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ వీటిని విక్రయానికి అందుబాటులో ఉంచుతున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ మాత్రమే కాకుండ.. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి వాటిపై కూడా రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపడం హర్షనీయం అంటున్నారు. మరి ప్రభుత్వ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.